Viral video ఫ్లూట్ వాయిస్తుంటే పాట పాడుతున్న పక్షి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..
రావెన్స్ పక్షులు( Ravens ) కాకుల లాగానే కనిపిస్తాయి కానీ ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, వీటి రెక్కలు కూడా 5 అడుగుల వరకు పెరుగుతాయి. అందువల్ల ఇవి కాకులకు ( Crows ) రెండు రెట్లు అధిక పరిమాణంలో కనిపిస్తాయి.
కాకులు జనావాసాల్లో పెరిగితే, రావెన్స్ అడవులు, పర్వతాలు, ఎడారులతో సహా వివిధ రకాల ఆవాసాలలో కనిపిస్తాయి. రావెన్స్ కీటకాలు, ఎలుకలు, పండ్లు తింటాయి. ఈ పక్షులు కాకుల కంటే చాలా తెలివైనవి. జంతువుల మాటలను అనుకరించగలవు.
నేర్పిస్తే పాటలు కూడా పాడగలవు. ఆ విషయాన్ని తాజాగా ఒక యజమాని నిరూపించాడు.
ఈ వ్యక్తి కొంతకాలంగా రావెన్ పక్షిని పెంచుతున్నాడు. అది అతనికి బాగా దగ్గర కూడా అయింది. ఈ క్రమంలో దానికి పాట పాడేలా( Singing ) ట్రైనింగ్ ఇచ్చాడు.
నిజానికి ఇతను ఒక ఫ్లూట్ ప్లేయర్. ఆ ఫ్లూట్ కి( Flute ) తగిన పాట పాడేలా ఈ పెద్ద కాకికి అతను ట్రైనింగ్ ఇచ్చాడు. అది తెలివైనది కాబట్టి వేణువును వాయిస్తుంటే పాడాలని అర్థం చేసుకొని దానికి వచ్చినట్లుగా పాడుతూ ఉంది. ఇది ఫ్లూట్ వాయిస్తూ ఉంటే పాడుతున్నప్పుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దానిని సైన్స్ గర్ల్ అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ రీషేర్ చేసింది. ఆ వీడియోకు ఇప్పటికే 44 లక్షల వ్యూస్ వచ్చాయి. 60 వేల దాకా లైకులు వచ్చాయి. ఈ వీడియోలో రావెన్ పక్షి చాలా అద్భుతంగా పాడటం( Raven Singing ) మనం చూడవచ్చు. కోకిల లాగా దాని గొంతు మధురంగా లేదు కానీ అది మాత్రం బాగానే ఆకట్టుకునేలా ఆలపిస్తోంది. ఈ వీడియో చూసినవారు ఈ పక్షి వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, వింటుంటే ఇంకా వినాలనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. బెస్ట్ ఫోక్ సింగర్ అవార్డును ఈ పక్షికి ఇచ్చేయండి అంటూ ఇంకొందరు ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ అద్భుతమైన వీడియోను మీరు కూడా చూసేయండి.
0 Comments:
Post a Comment