Viral Most Expensive Cigarette: ఈ సిగరెట్ తాగాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాలి
Most Expensive Cigarette: భారతదేశంలో ప్రతిరోజూ కోట్ల రూపాయల విలువైన సిగరెట్లు అమ్ముడవుతున్నాయి. ప్రపంచం మొత్తం మార్కెట్ చూస్తే ఈ మార్కెట్ ఎంత పెద్దదో తెలిసిపోతుంది.
అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగరెట్ ఖరీదు ఎంతో తెలుసా? అందరూ తాగలేని ఈ సిగరెట్ ఏంటో చూద్దాం.
ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగరెట్ పేరు ట్రెజరర్ లగ్జరీ బ్లాక్ సిగరెట్. బ్లాక్ అండ్ గోల్డెన్ బాక్స్ లో వచ్చే ఈ సిగరెట్ ఎవరికైనా జేబులో ఉందంటే.. అతడు కోటీశ్వరుడే అని అర్థం చేసుకోండి. ఎందుకంటే, ఈ సిగరెట్ ప్యాకెట్ ధర సుమారు 5,500 రూపాయలు. రెండవ అత్యంత ఖరీదైన సిగరెట్ ట్రెజరర్ అల్యూమినియం గోల్డ్ సిగరెట్. ఈ సిగరెట్ బంగారు, తెలుపు రంగులలో వస్తుంది. ఒక్క పెట్టె ధర 5,000 రూపాయలు.
ఇక మూడవ స్థానంలో సిగరెట్ పేరు సోబ్రానీ బ్లాక్ రష్యన్స్ సిగరెట్. ఇది రష్యన్ సిగరెట్. ఈ సిగరెట్‌లో ప్రత్యేకత ఏంటంటే.. వివిధ దేశాల నుంచి తెచ్చిన పొగాకుతో దీన్ని తయారు చేస్తారు. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర దాదాపు 1000 రూపాయలు. నాలుగవ స్థానంలో ఉన్న సిగరెట్ నాట్ షెర్మాన్ సిగరెట్.
ఇది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన సిగరెట్ బ్రాండ్. ఈ సంస్థ గత 100 సంవత్సరాలుగా పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర 850 రూపాయలు. అయితే, మనం ఐదవ నంబర్ సిగరెట్ గురించి మాట్లాడినట్లయితే, ఈ సిగరెట్ పేరు మార్ల్‌బోరో వింటేజ్ సిగరెట్. ఈ బ్రాండ్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర దాదాపు 815 రూపాయలు.
0 Comments:
Post a Comment