Shocking: బాబోయ్.. మార్కెట్లో నయా మోసం.. తాజాగా ఉన్నాయి కదా అని బంగాళదుంపలను కొంటున్నారా..?
మార్కెట్‌కు వెళ్లి ఫ్రెష్‌గా కనిపించే బంగాళదుంపులు(Potato) కొని తెచ్చుకుందామని అనుకుంటున్నారా? అయితే, ఒక్క నిమిషం ఆగండి..! మార్కెట్లల్లో ప్రస్తుతం ఓ కొత్త తరహా మొసం మొదలైంది.
డబ్బులకు కక్కుర్తికి పడే వ్యాపారులు తెరలేపిన ఈ నయా మాయాజాలం జనాల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తోంది.
బంగాళదుంపలను ఫ్రెష్‌గా కనిపించేలా చేసేందుకు వ్యాపారులు రసాయనాలను వినియోగిస్తున్నారు. ముందుగా వాటిని అమ్మోనియా, యాసిడ్‌తో కడిగి తాాజాగా కనిపించేలా చేస్తు్న్నారట. తెరవెనుక ఏం జరుగుతోందో అర్థం కానీ జనాలు వీటిని కొనుగోలు చేస్తూ అనారోగ్యానికి గురవుతున్నారు. అధిక ధర చెల్లించి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
అయితే, ఈ రసాయనాలతో కడిగిన బంగాళదుంపులతో ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, లివర్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
0 Comments:
Post a Comment