దక్షిణాదిలో దంచికొట్టనున్న వర్షాలు..ఐఎండీ తాజా సమాచారం..!!
సాధారణంగా నవంబర్ నెలలో వర్షాలు పడటం అరుదు. కానీ ఇప్పుడు పరిస్ధితి భిన్నంగా ఉంది. నవంబర్ ప్రారంభం నుంచి దక్షిణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.
ఇందుకు బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉంటున్నాయి. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో తుఫాన్ తరహా వాతావరణం ఉంది. బలమైన తూర్పు, ఈశాన్య గాలులు వీస్తుండటంతో అవి దక్షిణాది రాష్ట్రాలవైపు కదులుతున్నాయి. వీటి కారణంగా నేడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరీ, కర్నాటక, కేరళ, లక్ష్యద్వీప్, గోవా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
నేడు తెలుగు రాష్ట్రాలపై మేఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ, కోస్తా ఆంధ్రపై మేఘాల కదలిక ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన లేదని తెలిపింది. కానీ మేఘాల కదలిక మాత్రం ఉంటుందని వెల్లడించింది.
ఇక ఉష్ణోగ్రతలను గమనించినట్లయితే తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రత 22డిగ్రీల సెల్సియస్, మాగ్జిమం 24డిగ్రీల సెల్సియస్ ఉంది. ఏపీలో మినిమం 24డిగ్రీల సెల్సియస్, మ్యాగ్జిమం 25 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే పగటి ఉష్ణోగ్రతను చూసినట్లయితే తెలంగాణలో మినిమం 24 డిగ్రీల సెల్సియస్ , మ్యాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి.
మొత్తంగా కొన్ని ప్రాంతాల్లో ఎండ…మరికొన్ని ప్రాంతాల్లో మేఘాలతో కూడిన వాతావరణం కనిపిస్తుంది. కోస్తా, తూర్పు, రాయలసీమ ప్రాంతాల్లో కొంత చల్లదనం కనిపిస్తోంది.
0 Comments:
Post a Comment