Karthika Masam : కార్తీక మాసం.. ఈ 30 రోజుల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
కార్తీక మాసంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తారు. ఈ మాసంలో దీపారాధన చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.
కార్తీక మాసం 2023 నవంబర్ 14న ప్రారంభమైంది, డిసెంబర్ 13తో పూర్తవుతుంది. కార్తీక మాసం ప్రాముఖ్యత, ఈ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం..
పౌరాణిక కథనం ప్రకారం, శివుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి జారుకుంటాడని, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడిని సంహరించి విశ్వాన్ని రక్షించాడని అంటారు. అలాగే ఈ మాసంలో గంగా నది నదులు, చెరువులు, బావులలో ప్రవహించి ఆ నీటిని అమృతంగా మారుస్తుంది. అందుకే ఈ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
కార్తీక మాసంలో ఏం చేయాలి?
కార్తీక మాసంలో రెండుసార్లు స్నానం చేసి దీపారాధన చేయాలి.
సాయంత్రం దీపం వెలిగించి పూజ చేయడం మానేయకండి.
కార్తీక పురాణాన్ని చదవడం, ఎవరైనా బిగ్గరగా చదువుతుంటే వినడం కూడా మంచిది.
సోమవారం నాడు ప్రసాదం తయారుచేయాలి, మిగిలిన రోజుల్లో పండ్లను ప్రసాదంగా సమర్పించవచ్చు.
ఏం చేయకూడదు?
ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోకూడదు.
నువ్వుల నూనెను దీపాలు వెలిగించడానికి తప్ప మరే ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు. పప్పు తినకూడదు.
రోజుకు ఒకసారి మాత్రమే తింటే మంచిది.
కుదరకపోతే సోమవారం, కార్తీక సోమవారం, కార్తీక పూర్ణిమ ఉపవాసం ఉండండి.
కార్తీక మాసం రోజువారీ ప్రాముఖ్యత
పాడ్యమి, 1వ రోజు : శివాలయానికి వెళ్లి పూజలు చేయండి.
తదియ, 2వ రోజు : అన్నదమ్ముల ఇంటికి వెళ్లి భోజనం తిని, కానుకలు ఇచ్చి ఆశీర్వదించండి.
తదియ, 3వ రోజు : పార్వతీ దేవికి కుంకుమార్చన చేయాలి.
4వ రోజు : సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి.
పంచమి, 5వ రోజు : ఈ రోజునే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయాలి.
షష్ఠి, 6వ రోజు : ఈ రోజు మీకు ఇష్టమైన ఆహారం తినకండి.
సప్తమి, 7వ రోజు : సూర్యుడిని ఆరాధించి, ఎర్రటి వస్త్రంలో గోధుమలను దానం చేయండి.
అష్టమి, 8వ రోజు : ఆవుకు పూజ చేయాలి.
నవమి, 9వ రోజు : త్రినాథ వ్రతం ప్రారంభించడానికి మంచి రోజు. ఇలా 3 రోజులు చేయాలి. సాయంత్రం దీపం వెలిగించి విష్ణుమూర్తిని పూజించాలి.
దశమి, 10వ రోజు : ఈ రోజున విష్ణుమూర్తిని పూజించండి.
ఏకాదశి, 11వ రోజు : ఈ రోజు ఉపవాసం ఉండి, ద్వాదశి నాడు విరమించాలి.
ద్వాదశి, 12వ రోజు : ఈ రోజున విష్ణుమూర్తికి పూజలు చేయాలి. తులసి, ఉసిరి మొక్కకు పూజ చేయండి.
త్రయోదశి, 13వ రోజు : ఈ రోజు రాత్రి భోజనం మానేయడం మంచిది, ఈ పవిత్రమైన రోజున బ్రాహ్మణుడికి సాలిగ్రామ రాయిని ఇవ్వండి.
చతుర్దశి, 14వ రోజు : ఈ రోజు దానం చేయండి. మీకు ఇష్టమైన ఆహారం తినకండి.
పౌర్ణమి, 15వ రోజు : ఈ రోజున నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించాలి.
బహుళ పాడ్యమి, 16వ రోజు : మిగిలిన ఆహారం, పెరుగు తినకూడదు.
విదియ, 17వ రోజు : జామకాయ మొక్కను పూజించాలి. కుటుంబ సమేతంగా కలిసి తినండి.
తదియ, 18వ రోజు : ఈ రోజున బ్రాహ్మణులకు తులసి మాల వేయాలి.
చవితి, 19వ రోజు : ఈ రోజున వినాయకునికి గరికె సమర్పించి పూజ చేయాలి.
పంచమి, 20వ రోజు : ఈ రోజున జంతువులకు ఆహారం దానం చేయాలి.
షష్ఠి, 21వ రోజు : ఈ రోజున గ్రామదేవతకు పూజలు చేయాలి. ఈ రోజు మీ పరిస్థితిని బట్టి దానం చేయండి.
సప్తమి, 22వ రోజు : ఈ రోజున శివునికి పుష్పం సమర్పించి పూజ చేయాలి.
అష్టమి, 23వ రోజు : ఈ రోజున భైరవుడికి పూజలు చేయాలి.
నవమి, 24వ రోజు : ఈ రోజున నీరు, ఎర్ర చీర, బ్లౌజ్ ముక్క, కంకణం దానం చేయండి.
దశమి, 25వ రోజు : ఈ రోజున ఉపవాసం ఉండటం మంచిది, అవసరమైన వారికి అన్నదానం చేయాలి.
ఏకాదశి, 26వ రోజు : ఈ రోజు దీపారాధన తర్వాత పౌరాణిక కథలు వినడం చాలా మంచిది.
ద్వాదశి, 27వ రోజు : పేదలకు అన్నదానం చేయండి.
త్రయోదశి, 28వ రోజు : నవగ్రహాలను పూజించండి.
చతుర్దశి, 29వ రోజు : ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజించండి.
అమావాస్య, 30వ రోజు : పితృ దేవతల (మరణించిన పూర్వీకులు) పేరుతో అన్నదానం చేయండి. ఆలయాన్ని సందర్శించండి, దీపం వెలిగించి, కొబ్బరికాయను సమర్పించండి.
0 Comments:
Post a Comment