IB Recruitment : పదోతరగతి పాసైతే చాలు.ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు
IB Recruitment : కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ అసిస్టెంట్,మోటార్ ట్రాన్స్‌పోర్ట్,మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 14 నుండి ప్రారంభమైంది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 677 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సెక్యూరిటీ అసిస్టెంట్,మోటార్ ట్రాన్స్ పోర్టు 362 ఖాళీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 315 ఖాళీలు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ గడువు మరో వారంలో ముగియనుంది. నవంబర్ 13 చివరి తేదిగా నిర్ణయించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవటం మంచిది.
అర్హతలు ;
దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సెక్యూరిటీ అసిస్టెంట్/(మోటర్ ట్రాన్స్‌ఫోర్ట్ పోస్టులకు దరఖాస్తుకునే అభ్యర్థల వయసు 27 ఏళ్ల లోపు ఉండాలి. డైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.
జీతభత్యాలు
ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 అందిస్తారు. మల్టీ స్టాఫ్ టాస్కింగ్ పోస్ట్‌కు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాలి. ఎస్టీ, ఎస్టీ, పీదబ్య్యూడీ, మహిళ అభ్యర్థులు రూ. 50 ఫీజుగా చెల్లించాలి. ఆన్‌లైన్‌లో నవంబర్ 13లోపు అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం ;
స్టేజ్ 1 ; ముందుగా అధికారిక పోర్టల్ WWW.MHA.GOV.IN ఓపెన్ చేయాలి.
స్టేజ్ 2 ; హోమ్‌పేజీలోకి వెళ్లి, వాట్స్‌న్యూ అనే కేటగిరిలో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద ఎస్‌ఏ/ఎంటీ అండ్ ఎంటీఎస్/జెన్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. వెంటనే నోటిఫికేషన్ వివరాలు వస్తాయి. వాటిని పరిశీలించాలి.
స్టేజ్ 3 : ఆ తరువాత అప్లై ఆన్‌లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందు పేరు, ఫోన్ నంబర్, డే ట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.
స్టేజ్ 4 : అనంతరం రిజిస్టర్ ఐడీ సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి అన్ని వివరాలను నింపాలి.
స్టేజ్ 5 ; అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించి, అడిగిన అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
0 Comments:
Post a Comment