Health Tips : నానబెట్టిన శనగలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..!
చాలా మంది పొద్దున్నే ఆయిల్ లో వేయించిన ఆహారాలను తింటుంటారు. టిఫిన్ పేరుతో బజ్జీలు, వడలులాంటివి తింటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమీ ఉండవు.
ఇంకా చెప్పాలంటే వాటితో నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాలు తెలియక చాలామంది అనారోగ్యాల పాలు అవుతున్నారు. ఇక నానబెట్టిన శెనగల గురించి చాలమందికి తెలియదు. నిజంగా నానబెట్టిన శెనగలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బాడీలో శక్తి పెరుగుతుంది తప్ప అస్సల తగ్గదు. ఎందుకంటే శనగల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
పైగా శెనగల్లో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,కొవ్వులు, పీచు పదార్థాలు బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. నానబెట్టిన శనగలు బరువు తగ్గటానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది ఒక పోషకం. దాంతో పాటు ఉదయాన్నే నానబెట్టిన శనగలను తీసుకుంటే.. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దాంతో ఆటోమేటిక్ గా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో హిమోగ్లోబిల్ స్థాయిని మెరుగు పరచడం లో సహాయపడుతుంటాయి ఈ శెనగలు.
వాస్తవానికి నానబెట్టిన శనగల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే మన బాడీలో ఉండే అన్ని రకాల డేంజర్ టాక్సిన్స్ ను తీసేస్తుంది. ఫైబర్ కంటెంట్ ఉన్న శనగలను తీసుకోవడం వల్ల మన కడుపు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. కాబట్టి అనారోగ్యకరమైన ఫ్రై చేసిన ఫుడ్స్, ఇతర అనారోగ్యకరమైన స్నాక్స్ తినకుండా ఇది కాపాడుతుంది. దాని వల్ల మన జీర్ణ వ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇందులో కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి కూడా ఉంటుంది. దాని వల్ల మన గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
శనగల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల మన జుట్టు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. పైగా
శనగల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల మన బాడీలో బీపీ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే గుండె సమస్య రాకుండా చూస్తోంది.
దాంతో పాటు హై బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. ఇక శనగల్లో ఉండే కాల్షియం, ఐరన్ ఎముకలను ధృడంగా ఉంచుతుంటాయి. దాంతో మన బాడీలోని ఎముకలు ఎంతో ఆరోగ్యంగా ధృడంగా ఉంటాయి. దాని వల్ల మనకు కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులు రాకుండా అడ్డుకోవడం శనగలు బాగా ఉపయోగపడుతాయి.
0 Comments:
Post a Comment