Happy Diwali 2023 Wishes : వాట్సాప్‌లో దీపావళి కస్టమ్ స్టిక్కర్లు క్రియేట్ చేసి ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్!
Happy Diwali 2023 Wishes : దీపావళి వచ్చేసింది.. ప్రతిఒక్కరూ తమ ప్రియమైన వారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అందులో ఎక్కువగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు.
ఈ రోజుల్లో శుభాకాంక్షలు పంపడానికి వాట్సాప్ స్టిక్కర్లు ఒక సులభమైన మార్గంగా చెప్పవచ్చు.
అయితే, జెనరిక్ స్టిక్కర్లు (దీపావళి స్టిక్కర్లు) అంత సరదాగా ఉండవు. మీరు వాట్సాప్‌లో కస్టమ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు. ఇప్పుడు, వాట్సాప్ కస్టమ్ స్టిక్కర్లను ఎలా క్రియేట్ చేయాలా? అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి ట్రై చేయండి.
మీ కెమెరా యాప్‌ని ఓపెన్ చేసి.. మీ ఫ్యామిలీ లేదా స్నేహితులతో రెండు ఫొటోలను (కనీసం మూడు) క్యాప్చర్ చేయండి. ప్రత్యామ్నాయంగా, మీ గ్యాలరీ నుంచి ఫొటోలను కూడా ఎంచుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌ని సందర్శించి, బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ యాప్ కోసం సెర్చ్ చేయండి. వాట్సాప్ యాప్ డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఆపై బ్యాక్‌గ్రౌడ్ రిమూవ్ కోసం ఫొటోలను ఇంపోర్ట్ చేయండి. యాప్‌లో ఇమేజ్‌లు లోడ్ అయిన తర్వాత, వాటిని ఎరేజ్ చేయడానికి, అవసరమైన విధంగా క్రాప్ చేసుకోండి. వాట్సాప్‌కు స్టిక్కర్ ప్యాక్ కోసం కనీసం 3 ఫొటోలు అవసరమని గుర్తుంచుకోండి.
Happy Diwali 2023 Wishes : custom WhatsApp stickers
వాట్సాప్‌కు స్టిక్కర్‌లను ఇలా యాడ్ చేయండి :
* గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి వాట్సాప్ కోసం పర్సనల్ స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
* వాట్సాప్‌లో మీ గ్యాలరీ నుంచి బ్యాక్‌గ్రౌండ్ (స్టిక్కర్లు) లేని ఫొటోలను ఆటోమాటిక్‌గా గుర్తిస్తుంది.
* కావలసిన స్టిక్కర్ ప్యాక్ పక్కన ఉన్న ‘యాడ్’ బటన్‌ను నొక్కండి.
* ప్రాంప్ట్ చేసినప్పుడు మళ్లీ ‘యాడ్’ బటన్ నొక్కాలి.
* వాట్సాప్ ఓపెన్ చేసి కీబోర్డ్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న ఎమోజి ఐకాన్ ఎంచుకోవడం ద్వారా స్టిక్కర్ సెక్షన్ నావిగేట్ చేయండి.
* స్టిక్కర్ ఐకాన్ నొక్కండి. స్క్రీన్ రైట్ కార్నర్ బాటమ్‌లో (+) యాడ్ బటన్‌ను క్లిక్ చేయండి.
* ‘మై స్టిక్కర్లు’ ట్యాబ్‌ను యాక్సెస్ చేసి, ‘స్టిక్కర్లు’ నిలువు వరుసను పైకి లాగండి.
* ఎమోజీ ఐకాన్ ట్రేకి తిరిగి వెళ్లి మళ్లీ ‘స్టిక్కర్’ బటన్‌ను ట్యాప్ చేయండి.
* మీ స్టిక్కర్ ప్యాక్‌లను ప్రదర్శించే ట్యాబ్ కీబోర్డ్ ఎగువన కనిపిస్తుంది.
* మీ స్టిక్కర్లు ఉన్న చోట కనిపించే ట్యాబ్‌ను ఎంచుకోండి.
* మీరు పంపాలనుకుంటున్న నిర్దిష్ట స్టిక్కర్‌ను ట్యాప్ చేయండి.
అంతే.. మీ వాట్సాప్ కస్టమ్ స్టిక్కర్ మీరు పంపాలనుకునే వారికి వెళ్లిపోతుంది.
0 Comments:
Post a Comment