Business Idea: మొబైల్ టెంపర్డ్ గ్లాస్ తయారీతో వేలల్లో సంపాదన.. నష్టం లేని బిజినెస్..
ప్రస్తుతం యువత ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మంచి మంచి బిజినెస్ ఐడియాలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.
తెలివిగా ఆలోచిస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఇలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ల వినియోగం భారీగా పెరిగింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారిని భూతద్ధంలో వెతికినా దొరకని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా భారీ స్క్రీన్‌లతో కూడిన మొబైల్ ఫోన్స్‌ను వినియోగిస్తున్నారు. దీంతో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం అనివార్యంగా గ్లాస్‌లను ఉపయోగించాల్సిన పరిస్థితి. పొరపాటు స్క్రీన్ పగిలితే వేలల్లో పెట్టాల్సిందే. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే టెంపర్డ్ గ్లాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ గ్లాస్‌ల సహాయంతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్స్‌కి ప్రొటెక్షన్ పెరుగుతోంది. దీంతో టెంపర్డ్ గ్లాస్‌ల వినియోగం భారీగా పెరిగింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు టెంపర్డ్ గ్లాస్‌ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు.
తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించే ఈ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. దాదాపు నష్టం అనేది ఉండని ఈ వ్యాపారంలో సుమారు 90 శాతం వరకు లాభాలను పొందొచ్చు. టెంపర్డ్ గ్లాస్ తయారీకి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. చిన్న గది ఉంటే చాలు, వీటి తయారీని ప్రారంభించవచ్చు. ఇందుకోసం యాంటీ సక్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్మ్, ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ మెషీన్‌ని కొనుగోలు చేయాలి. అలాగే టెంపర్డ్ గ్లాస్ ప్యాకింగ్‌కు అవసరయ్యే వస్తువులను కొనుగోలు చేయాలి. ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మిషన్‌తో చాలా సులభంగా టెంపర్డ్ గ్లాస్‌ను తయారు చేయొచ్చు.
సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేసే ఈ మిషన్‌ను ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి, మీరు టెంపర్డ్ గ్లాస్‌ను ఏ ఫోన్‌కు సరిపోయేలా డిజైన్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవాలి. అంతే సింపుల్‌గా టెంపర్డ్ గ్లాస్ తయారైపోతుంది. ఇందుకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు సైతం అందుబాటులో ఉన్నాయి. లేదంటే యూట్యూబ్‌లో కూడా కొన్ని వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇక పెట్టుబడి విషయానికొస్తే.. గ్లాస్ తయారీకి అవసరమయ్యే పరికరాలకు రూ. 1 లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఇక ఒక గ్లాస్ తయారీకి మీకు సుమారు రూ. 7 నుంచి రూ. 16 ఖర్చవుతుంది. అయితే మార్కెట్లో కనీసం రూ. 50 నుంచి రూ. 200 వరకు అమ్ముతున్నారు. ఈ లెక్కన ఈ గ్లాస్ తయారీలో ఎంత లాభం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్పత్తి భారీగా చేస్తే లక్షల్లో కూడా ఆదాయం పొందొచ్చు.
0 Comments:
Post a Comment