Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. ఈ బిజినెస్‌తో డబ్బే, డబ్బు..
ఎంత ఉద్యోగం చేసే వారైనా సరే ఏదో ఒక రోజు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటారు. నిత్యం అందుకోసమే ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగానే ఎంతో కొంత పొదుపు చేసుకొని ఏ రోజైనా సొంతంగా వ్యాపారం చేసుకోవాలని భావిస్తుంటారు.
అయితే వ్యాపారం చేయాలనుకునే వారికి మొదటగా వచ్చే సందేహం, నష్టం వస్తే ఎలా అనే. అదే ఉద్యోగం అయితే నెల తిరిగే లోపు జీతం వస్తుందన్న నమ్మకంతో ఉంటారు.
అందుకే వ్యాపారం చేయడానికి పెద్దగా ధైర్యం చేయరు. కానీ మంచి బిజినెస్ ఐడియాను ఎంచుకుంటే మాత్రం నష్టం అనే భయం లేకుండా వ్యాపారంలోకి దిగొచ్చు. అలాంటి ఎన్నో వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి బోన్సాయ్ చెట్ల పెంపకం. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ వాస్తుపై ఆసక్తి పెరుగుతోంది. వాస్తు నియమాలను పాటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వాస్తు ఆధారంగా ఇంట్లో మొక్కలను పెంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రజల ఈ సెంటిమెంట్ వ్యాపారవేత్తలకు మంచి ఆదాయ వనరుగా మారుతోంది.
బోన్సాయ్ మొక్కలను పెంచడం ఇప్పుడు ఒక మంచి ట్రెండీ వ్యాపారంగా మారుతోంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. కేవలం వాస్తు మాత్రమే కాకుండా ఇంటి అలంకరణకు కూడా బోన్సాయ్ మొక్కలను పెంచుకుంటున్నారు. బోన్సోయ్ మొక్కల వ్యాపారాన్ని కేవలం రూ. 20 వేల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. అయితే లాభాలు మాత్రం లక్షల్లో ఆర్జించవచ్చు. బోన్సాయ్ మొక్క ప్రస్తుతం మార్కెట్లో రూ. 300 నుంచి రూ. 40 వేల వరకు పలుకుతోంది. బోన్సాయ్ మొక్క వయసు ఆధారంగా దాని ధరను నిర్ణయిస్తుంటారు.
బోన్సాయ్ మొక్కల వ్యాపారాన్ని ప్రారంభించడానికి చిన్న స్థలం ఉన్నా సరిపోతుంది. ఇంటి ముందు ఉండే కాసింత స్థలంలో కూడా బోన్సాయ్ మొక్కలను పెంచుకోవచ్చు. పెద్ద నగారలతో పాటు చిన్న పట్టణాల్లోనూ ఇటీవల బోన్సాయ్ మొక్కలకు డిమాండ్ పెరుగుతోంది. కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఇతరులకు బహుమతి ఇవ్వడానికి కూడా బోన్సాయ్ మొక్కలను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
దీంతో ఈ వ్యాపారంలో ఎలాంటి నష్టం లేకుండా ప్రారంభింవచ్చు. పెంచిన మొక్కలను నేరుగా నర్సరీలోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా విక్రయించుకోవచ్చు. బోన్సాయ్ మొక్కల పెంపకానికి సంబంధించి కొన్ని సంస్థలు శిక్షణ కూడ అందిస్తున్నాయి. యూట్యూబ్‌లో కూడా బోన్సాయ్ మొక్కలను ఎలా పెంచాలో వివరాలు తెలుపుతూ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. బోన్సాయ్ వ్యాపారం ద్వారా నెలకు రూ. 3 లక్షల వరకు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు.
0 Comments:
Post a Comment