Broccoli Benefits: బ్రోకలీ ఔషధాల నిధి, రోజు ఇలా తినండి చాలు..క్యాన్సర్ సైతం చెక్!
Broccoli Benefits: ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా శీతాకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. తరచుగా ఆహారాల్లో బ్రోకలీని తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల కారణంగా దెబ్బతిన్న అవయవాలు కూడా మెరుగుపడతాయి. అయితే ప్రతి రోజు బ్రోకలీని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
ఆధునిక జీవనశైలిని అనుసరించే చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. కొంతమందిలో అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల చెడు కొవ్వు పెరిగిపోతోంది. అయితే ఈ కొలెస్ట్రాల్‌ను ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు ఆహారంలో బ్రోకలీని తీసుకోవాల్సి ఉంటుంది.
క్యాన్సర్ నుంచి విముక్తి:
క్యాన్సర్‌తో పోరాడే వారు ప్రతి రోజు ఆహారంలో బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు, క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి.. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. బ్రోకలీలో ఈస్ట్రోజెన్‌ను తగ్గించే గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్మ, గర్భాశయ క్యాన్సర్‌ను నివారణకు ప్రభావంతంగా సహాయపడుతుంది.
ఎముకల దృఢత్వం కోసం:
బ్రోకలీలో అధిక పరిమాణంలో కాల్షియం, విటమిన్ కె లభిస్తాయి. కాబట్టి బోలు ఎముకల వ్యాధి ఇతర సమస్యలతో బాధపడేవారికి ఈ బ్రోకలీ ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా అన్ని రకాల ఎముక వ్యాధులు దూరమవుతాయి. ఇందులో కాల్షియంతో పాటు మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. దీని కారణంగా ఎముఖ దృఢంగా, బలంగా తయారవుతాయి.
0 Comments:
Post a Comment