Breaking Red Sandal: కేంద్రం గుడ్ న్యూస్- ఎర్ర చందనం పెంపకం, ఎగుమతికీ గ్రీన్ సిగ్నల్..!
ఎర్ర చందనం పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది అల్లు అర్జున్ సినిమా పుష్ప. ఇందులో ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్, ఎగుమతుల కోసం జరిగే పోరు, అందులో ఉండే కష్టనష్టాలు, ఫైనల్ గా వీటికి దేశ విదేశాల్లో ఉండే విలువ కూడా.
ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులపై 2004 నుంచీ పెట్టిన ఆంక్షల వల్లే. ఇప్పుడు వాటిని ఎత్తేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది.
ఒకప్పుడు వాణిజ్య పరంగా ఉన్న ఆంక్షలు, ఎగుమతులపై ఉన్న ఆంక్షలతో ఎర్రచందనం అక్రమ రవాణా పెరిగిపోయింది. అంతే కాదు ప్రభుత్వాల తరఫున ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాగే ఈ ఎర్రచందనం అక్రమంగా పండించి, ఎగుమతులు చేసుకుని కోట్లు గడించిన వారూ లేకపోలేదు.
కానీ 2004లో కేంద్ర ప్రభుత్వం ఎర్ర చందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష పరిధిలోకి తెచ్చింది. దీంతో ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఎన్నో అనుమతులు తీసుకుంటే తప్ప ఎర్ర చందనాన్ని పండించేందుకు కానీ, ఎగుమతులు చేసేందుకు కానీ అవకాశం లేకుండా పోయింది. దీంతో అప్పటివరకూ ఎర్ర చందనం పండిస్తున్న రైతులు ప్రధానంగా నష్టపోయారు. అడవుల్లో పండే ఎర్ర చందనం పరిస్దితి ఎలా ఉన్నా.. గ్రామాల్లో పండించుకుని అమ్ముకునే రైతులు మాత్రం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కేంద్రం వీరికి ఊరటనిచ్చింది.
ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ స్విట్లర్లాండ్ లోని జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సు (కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేజర్డ్ స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా) లో ఎర్ర చందనంపై ఉన్న ఆంక్షల్ని తొలగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీని ప్రకారం ఎర్ర చందనం పెంపకంతో పాటు ఎగుమతులపై ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు.
0 Comments:
Post a Comment