దేశంలోని ప్రతి మొబైల్ యూజర్లకు ఇకపై అది తప్పని సరి..కేంద్రం కీలక నిర్ణయం..
Mobile Users: భారత్ డిజిటలైజేషన్ వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీని బాగా సద్వినియోగం చేసుకుంటూ ప్రజల జీవితాలను సులభతరం చేస్తోంది. ప్రతి భారతీయుడి ప్రైవసీ, సేఫ్టీని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇందులో భాగంగా దేశంలోని ప్రతి మొబైల్ యూజర్ (Mobile user)కు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (Unique identification number)ను కేటాయించే కొత్త సిస్టమ్‌ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఫోన్ యూసేజ్ స్టోర్ చేస్తుంది..
ఈ నంబర్ మొబైల్ కనెక్షన్లు గల వ్యక్తులకు డిజిటల్ ఐడెంటిటీ కార్డుగా పని చేస్తుంది. ఇది ఫోన్ యూసేజ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని స్టోర్ చేస్తుంది. యూనిక్ ID నంబర్ ఎలాంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది? దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.
డేటా స్టోరేజ్..
ఒక యూజర్‌కు ఎన్ని ఫోన్లు ఉన్నాయి? ఒక యూజర్‌కు ఎన్ని SIM కార్డ్‌లు ఉన్నాయి? ఏ SIM కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి, ఏవి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయి? యూజర్ పేరు మీద ఎన్ని SIM కార్డ్‌లు రిజిస్టర్ అయ్యాయి? వంటి వివరాలన్నిటినీ యూనిట్ ఐడీ నంబర్ స్టోర్ చేస్తుంది. ఈ ఐడీలను కేటాయించే కొత్త విధానంతో అధికారులు, యూజర్లు కావాల్సిన సమాచారాన్ని సులభంగా కనుగొనవచ్చు. ఈ కొత్త వ్యవస్థ మొత్తం సమాచారానికి కేంద్ర భాండాగారంగా ఉంటుంది.
డిజిటల్ హెల్త్ అకౌంట్ లాగానే ఉంటుందా..?
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ABHA) అనేది ఒక వ్యక్తి మెడికల్ హిస్టరీకి డిజిటల్ రికార్డ్‌ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రోగ్రామ్. డాక్టర్లు ABHA నంబర్ ద్వారా రోగి మునుపటి హెల్త్ డేటాను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ABHAతో ఓల్డ్ మెడికల్ రికార్డులను క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. సేమ్ ఇలానే మొబైల్ యూజర్ కోసం అందించే యూనిక్ ID నంబర్ ఫోన్ యూసేజ్ హిస్టరీ మొత్తం స్టోర్ చేస్తుంది. అదొక డిజిటల్ ఆర్కైవ్‌గా పని చేస్తుంది. యూసేజ్ హిస్టరీ మొత్తం కొన్ని క్లిక్కులతో యాక్సెస్ చేయడం కుదురుతుంది.
ఫ్రాడ్ కాల్స్‌కు చెక్..
యూనిక్ ID నంబర్ సిస్టమ్ మొబైల్ యూజర్ల డిజిటల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దీనితో ఫేక్ లేదా చట్టవిరుద్ధమైన సిమ్ కార్డ్‌ల వినియోగాన్ని, హానికరమైన ప్రయోజనాల కోసం సిమ్ కార్డ్‌లను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడాన్ని అధికారులు గుర్తించి నిరోధించవచ్చు. ఇది నిర్దిష్ట వినియోగదారుతో అసోసియేట్ అయిన SIM కార్డును ట్రాక్ చేయడాన్ని కూడా సులభతరం చేస్తుంది. యూజర్లు కొత్త మొబైల్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు యూనిక్ ID నంబర్‌ను అందుకుంటారు. కొత్త SIM కార్డును కొనుగోలు చేసేటప్పుడు ఉద్దేశించిన యూజర్ (Intented users) వివరాలను కూడా అందించాలి.
0 Comments:
Post a Comment