నూతన వధూవరులకు టీటీడీ శుభవార్త
నూతన వధూవరులకు టీటీడీ శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతోసహా శుభలేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదాన్ని పోస్టులో పంపుతారు.
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): నూతన వధూవరులకు టీటీడీ శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతోసహా శుభలేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదాన్ని పోస్టులో పంపుతారు.
గతంలోనే ఈ విధానం అమల్లో ఉండగా, కరోనా కారణంగా టీటీడీ నిలిపివేసింది. ఇప్పడు ఈ విధానాన్ని పునఃప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి, ఈవో ఆఫీస్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీరోడ్, తిరుపతి -517501 అనే చిరునామాకు నూతన వధూవరుల వివరాలను పంపాలి. వివాహ ముహుర్తానికి నెలరోజుల ముందుగా వాటిని పంపాల్సి ఉంటుందని టీటీడీ పేర్కొన్నది.
0 Comments:
Post a Comment