చేతులు నల్లగా, నిర్జీవంగా మారాయా.. 15 నిమిషాల్లో పైసా ఖర్చు లేకుండా తెల్లగా మార్చుకోండిలా
బయటకు బహిర్గతమయ్యే శరీర భాగాల్లో చేతులు ఒకటి. అందుకే చేతులను అందంగా మెరిపించుకునేందుకు చాలా మంది మక్కువ చూపుతుంటారు. అయితే ఒక్కోసారి చేతులు నల్లగా, నిర్జీవంగా ( Dark hands )మారిపోతుంటాయి.
ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్( Dead skin cells ) పేరుకుపోవడం తదితర కారణాల వల్ల చేతులు అలా మారుతుంటాయి. దాంతో తెగ హైరానా పడిపోతుంటారు. అటువంటి చేతులను ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక మదన పడుతుంటారు. డోంట్ వర్రీ..
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే 15 నిమిషాల్లో పైసా ఖర్చు లేకుండా చేతులను తెల్లగా మార్చుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు బంగాళదుంప ముక్కలు,( Potato slices )అర కప్పు టమాటో ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloe vera gel )వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకోవాలి.
చివరిగా టమాటో పొటాటో జ్యూస్ ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వేళ్ళతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. దాదాపు 5 నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసిన అనంతరం వాటర్ తో హ్యాండ్స్ ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
ఈ విధంగా కనుక చేస్తే నల్లగా నిర్జీవంగా మారిన చేతులు మళ్లీ తెల్లగా, అందంగా మారుతాయి. గ్లోయింగ్ గా మెరుస్తాయి. డార్క్ హ్యాండ్స్ తో బాధపడేవారికి ఇది బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు.
0 Comments:
Post a Comment