AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. మళ్లీ వానలే వానలు
గత ఐదు రోజుల నుంచి ఏపీలో వర్షాలు పడుతున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తోంది.
దీని ప్రభావంతో 13 నాటికీ దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. 14, 15వ తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ ప్రాంతాల్లో, 15, 16 తేదీల్లో పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో గరిష్ఠంగా గంటకు 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.గతవారం అల్పపీడనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి.
దీంతో వాతావరణం చల్లబడింది.. అయితే రెండు రోజులుగా మళ్లీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఎండల ప్రభావం కనిపిస్తుండగా.. రాత్రి వేళల్లో మాత్రం చలి తీవ్రత పెరిగింది. అయితే ఈ నెల 14న అల్పపీడనం ఏర్పడుతుందనే అంచనాలతో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
0 Comments:
Post a Comment