రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్
ఆధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కరువు మండలాల ప్రకటనకు… పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడంపై రైతులు మరియు ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే.
CM Jagan gave good news to the farmers
అయితే ఈ అంశంపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. అర్హులైన రైతులందరికీ పంటల బీమా వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాలలో ఉచిత పంటల బీమా కింద రైతులకు 7800 కోట్ల పరిహారం ఇచ్చినట్లు గుర్తు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పరిహారం విషయంలో… ఏపీ రైతులు ఆందోళన చెందకూడదని ఆయన కోరారు.
0 Comments:
Post a Comment