Andhra University Recruitment : ఏయూలో 298 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ, ఇలా అప్లై చేసుకోండి!
Andhra University Recruitment : విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 298 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 20 అని ప్రకటించింది.
అభ్యర్థుల ధృవీకరణ పత్రాలతో పాటు అప్లికేషన్ హార్డ్ కాపీని నవంబర్ 27వ తేదీ లోపు ఆంధ్ర యూనివర్సిటీకి సమర్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ andhrauniversity.edu.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము :
అన్‌రిజర్వ్‌డ్/బీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అప్లికేషన్ ఫీజు- రూ.2500
ఎస్సీ/ఎస్టీ/పీబీడీల దరఖాస్తు రుసుము- రూ.2000
భారతీయ ఓవర్సీస్ సిటిజన్స్ (OCIలు) దరఖాస్తు రుసుము- రూ. 4,200
ఇలా దరఖాస్తు చేసుకోండి
ముందుగా andhrauniversity.edu.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
హోమ్‌పేజీలో "బీసీ బ్యాక్‌లాగ్, రెగ్యులర్ ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్" పై క్లిక్ చేయండి.
తరువాత అప్లై లింక్‌పై క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫారమ్ నింపండి.
దరఖాస్తులను సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరం కోసం ప్రింట్ తీసుకోండి.
దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత అభ్యర్థులు... ఆ దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. అనంతరం ఆ అప్లికేషన్ ను సంతకం చేసి, అవసరమైన విద్యార్హత పత్రాలు జతచేయాలి. వాటిని రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా నవంబర్ 27 లేదా అంతకు ముందు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి పంపాలి.
అప్లికేషన్ పోస్టు చేయాల్సిన చిరునామా
రిజిస్ట్రార్, ఆంధ్ర యూనివర్సిటీ, O/o. అడ్మిషన్స్ డైరెక్టరేట్, విజయనగర్ ప్యాలెస్, పెద్ద వాల్తేరు, విశాఖపట్నం-530003.
ఏపీ యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్ పోస్టులతో పాటు, 2,942 రెగ్యులర్ పోస్టుల భర్తీకి యూనివర్సిటీలు విడివిడిగా ప్రకటనలు విడుదల చేశాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి 418 ప్రొఫెసర్ పోస్టులు, 801 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2001 ట్రిపుల్‌ఐటీల లెక్చరర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు.
కోర్టు తీర్పునకు లోబడి భర్తీ
దరఖాస్తుల పరిశీలన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్క్రీనింగ్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను ఈ నెల 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. పోస్టుల భర్తీకి 2017, 2018ల్లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినందున కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కోర్టు తీర్పునకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించాయి.
0 Comments:
Post a Comment