Viral News: ఆడవాళ్లు నైటీలు వేసుకుంటే రూ.2వేలు జరిమానా..చూసి చెప్పిన వాళ్లకు వెయ్యి బహుమానం..ఎక్కడంటే..
ప్రస్తుతం సమాజంలో మహిళలు, యువతులు వేసుకునే దుస్తుల విషయంలో కట్టుబాట్లు, పద్దతులు, సంప్రదాయాలు అనే వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే కొందరు ఫ్యాషన్ కోసం మరికొందరు సౌకర్యంగా ఉంటుందని..ఇంకొందరు ఎలాంటి దుస్తులు వేసుకున్నా మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అనే ధీమానో తెలియదు కాని నైటీలు వాడకం బాగా పెరిగింది.
పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు తేడా లేకుండా మహిళలు, యువతులు నైటీలు(రాత్రి పూట వేసుకునే సింగిల్ డ్రెస్) వేసుకోవడం సర్వసాదారణమైపోయింది. దేశంలో ఎక్కడైనా ఓకే కాని ఆ ఊరిలో ఆడవాళ్లు, యువతులు పగటి సమయంలో నైటీలు (Nighties)వేసుకుంటే గ్రామ పెద్దలు జరిమానా(Fine) విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిజంగా అలా జరుగుతోందని తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి (West Godavari) జిల్లాలోని ఆ గ్రామనికి వెళ్లి విచారిస్తే నిజమేనని తేలింది. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు ముక్తకంఠంతో చెప్పడంతో అధికారులు వారి నిర్ణయాన్ని తప్పు పట్టలేకపోయారు.
ఆ గ్రామంలో ఆడవాళ్లకు కండీషన్..
గతంలో మన దేశంలోనే ఏదో ప్రాంతంలో నైటీలు వేసుకున్న ఆడవాళ్లకు జరిమానా విధించినట్లుగా వార్తలు విన్నాం. కాని ఇప్పుడు అలాంటి విచిత్రమైన వార్త మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే మరొకటి వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలోని తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు పగలు నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. కాదు కుదరదని ఎవరైనా నైటీలు వేసుకుంటే రెండు వేల రూపాయల జరిమానా కట్టాలని తీర్మానించారు. పగలు నైటీలు కట్టుకున్న వారిని చూసి చెప్పిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు.
నైటీలు వేసుకుంటే జరిమానా..
గ్రామాల్లో ఇలాంటి జరిమానాలు, గ్రామ పెద్దల తీర్మానాలు ఆనేక రకాలుగా ఉంటాయి. కాని నైటీలు వేసుకుంటే జరిమానా విధిస్తారనే వార్త వైరల్ అయింది. చివరకు ప్రభుత్వ అధికారుల చెవిలో ఈ విషయం పడటంతో నిడమర్రు ఎమ్మార్వో ఎం.సుందర్రాజు ఎస్ఐ విజయకుమార్ తోకలపల్లి గ్రామంలో గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకొన్నారు.
పద్దతులు, సాంప్రదాయాన్ని కాపాడేందుకే..
గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం, నైటీలు ధరించే వారి పట్ల విధించిన జరిమానా వాస్తవమని తేలడంతో ఊరి పెద్దలను కలిసి ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలను ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తోకలపల్లి గ్రామ పెద్దలు అధికారులకు తెలిపారు. ఊరి పెద్దల నిర్ణయాన్ని అధికారులు తప్పుపట్టలేకపోయారు.
0 Comments:
Post a Comment