కార్తీక మాసంలో.. వాటికి దూరం ఉండకపోతే మహాపాపం!
ఈ ఏడాది కార్తీక మాసం (నవంబర్ 14 రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం డిసెంబర్ 13 తో ముగుస్తుంది. ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ఈ మాసంలో శ్రీమహావిష్ణువును, శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతుంటారు. అలాగే ఉదయాన్నే నిద్రలేచి ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి చెట్టుకు పూజలు చేస్తారు. అంతేకాకుండా గుడికి వెళ్లి దీపాలను వెలిగిస్తారు. కార్తీక మాసంలో ఆహారం, బట్టలు, నువ్వులు, దీపాలు, ఉసిరిని దానం చేస్తే కుటంబానికి మంచిదని ప్రజల నమ్మకం. అయితే కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే మహా పాపం చుట్టుకుంటుందని పూర్వీకులు చెబుతుంటారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కార్తీక మాసంలో కచ్చితంగా చేయకూడని పనులు:
*మాంసాహారం తీసుకోకూడదు. మద్యం సేవించరాదు.
*కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. మౌనంగా భోజనం తీసుకోవాలి.
* గుమ్మడి కాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, వంటి ఆహార పదార్థాలు తినకూడదు.
* పసర పప్పు, శనగ పప్పు, నువ్వులు కూడా తీసుకోరాదు. ముఖ్యంగా కార్తీక మాసం ఆదివారం రోజు కొబ్బరి, ఉసిరికాయ తీసుకోరాదని పెద్దలు చెబుతారు.
* నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
* అలాగే దీపం దానం ఇచ్చేటప్పుడు ఒక్క దీపాన్ని ఇవ్వకూడదు.
0 Comments:
Post a Comment