✍️డీఏ ప్రయోజనం డిసెంబరు నుంచే
♦️2022 జులై డీఏ 3.64 శాతంగా ప్రకటించిన ప్రభుత్వం*
*🌻ఈనాడు, అమరావతి*: ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జులై డీఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన 3.64 శాతం డీఏ ఆర్ధిక ప్రయోజనాలను నవంబరు జీతంతో కలిపి డిసెంబరులో చెల్లిస్తామని పేర్కొంది. దసరా . కానుకగా డీఏ ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్... దానిని పండగకు ప్రకటించినా ఆ ఆర్థిక ప్రయోజ నాన్ని పొందేందుకు ఉద్యోగులు మరో రెండు నెలలు ఆగాల్సిందే. పండగకు ఎలాంటి ఆర్ధిక ప్రయోజనాలు లేవు. బఠాయిలను సైతం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మూడు విడతల్లో చెల్లిస్తామని చెప్పింది అప్పటికి సాధారణ ఎన్నికలు వచ్చేస్తాయి. మిగతా రెండు విడతల బకాయిలను ఆ తర్వాత వచ్చే ప్రభు త్వమే చెల్లించాల్సి ఉంటుంది. కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డీఏ 36 39 శాతమైంది. 2022 జులై నుంచి 2023 అక్టోబరు 31 వరకు ఉండే బకాయిలను జీపీఎస్, పిఎప్ ఖాతాలకు మూడు వాయిదాల్లో 2024 ఏప్రిల్, జులై, అక్టోబరులో జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సీపీఎస్ ఉద్యోగులకు సంబంధిం చిన డీఏ బకాయిలను 10శాతం ప్రాన్ ఖాతాకు జమ చేసి, మిగతా 80 శాతాన్ని మూడు వాయిదాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్, జులై, అక్టోబరు నెలల్లో చెల్లించనున్నట్లు వెల్లడించింది. బకాయిలు చెల్లించే కాలంలో పదవీ విరమణ చెందివారికి పదవీ విరమణ ప్రయోజనాలతో కలిపి చెల్లించనున్నట్లు తెలిపింది.
0 Comments:
Post a Comment