అనారోగ్య కారణాల దృష్ట్యా.. చంద్రబాబుకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. రూ.లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు తెలిపింది.
మధ్యంతర బెయిల్ సమయంలో చంద్రబాబు ఆస్పత్రి, ఇంటికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ఫోన్‌లో మాట్లాడకూడదనీ, మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని కూడా హైకోర్టు చెప్పింది. నవంబర్ నెల 24 వరకూ ఈ మధ్యంతర బెయిల్ ఉంటుంది. నవంబర్ 24న తిరిగి చంద్రబాబు సరెండర్ అవ్వాలని కోర్టు తెలిపింది.
స్కిల్ కేసులో ప్రధాన బెయిల్ పిటిషన్ పై వచ్చే నెల 10 విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
ఈరోజు సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల మధ్య చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు.. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. హైదరాబాద్ వెళ్తారని తెలిసింది.
బెయిల్ షరతులు
చంద్రబాబు ఎడమ కంటికి ఆల్రెడీ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉన్నందున ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు ఒప్పుకుంది..
53 రోజులుగా చంద్రబాబు జైలులోనే గడుపుతున్నారు. ఆయన తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు. దానిపై ఆల్రెడీ వాదనలు జరిగాక.. తీర్పును హైకోర్టు ఇవాళ్టికి రిజర్వు చేసి, ఇవాళ తీర్పును ఇచ్చింది.
ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఒప్పుకోలేదు. అందువల్ల చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో చంద్రబాబు తరపున సీనియర్ లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. అలాగే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్.. సిద్ధార్థ లూత్రా వర్చువల్‌గా వాదించారు. ఏపీ సీఐడీ తరపున సీనియర్ లాయర్, AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.
కుడి కంటికి ఆపరేషన్
73 ఏళ్ల చంద్రబాబుకి ఆరోగ్యం బాగోలేదనీ, కంటికి ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు సూచించారని ఆయన తరపు లాయర్లు వాదించారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
0 Comments:
Post a Comment