Teachers Fires on Minister Adimulapu Suresh Controversial Comments: మంత్రి ఆదిమూలపు సురేష్ గూగుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు..
ప్రకాశం: మంత్రి ఆదిమూపు సురేష్ (Minister Adimulapu Suresh) వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న (మంగళవారం) గురుపూజోత్సవం సభలో టీచర్స్‌ను అగౌరవ పరుస్తూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బైజూస్‌తో టెక్నాలజీ అంతా ట్యాబ్‌ల్లో వచ్చిందని.. గురువులు బదులు ఇప్పుడు గూగుల్ వచ్చిందని అన్నారు. గురువులకి తెలియనివి కూడా గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందన్నారు. గూగుల్ వచ్చిన తరువాత గురువులు అవసరం లేదంటూ మంత్రి సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనిపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ.. గురువులు కన్నా గూగుల్ మిన్న అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ వాఖ్యలు అసంబద్దం, అర్ధ రహితమన్నారు. గురువులకు సన్మానం చేసారో లేదా అవమానం చేశారో మంత్రి తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గురుపూజోత్సవం రోజే, గురువుల సన్మాన సభలో ఉపాధ్యాయులను అవమానించడం తగదన్నారు.
ఉపాధ్యాయునికి ఏది ప్రత్యామ్నాయం కాదన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా గూగుల్ చదువులు లేవని తెలిపారు. గురువు లే చదువులు చెప్తున్నారని మన్నం శ్రీనివాస్ వెల్లడించారు.
To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
LATEST UPDATES

0 Comments:
Post a Comment