SIM Cards New Rule: అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి కొత్త రూల్.. ఇకపై సిమ్ కార్డు పోయినా, పాడైపోయినా..!
సిమ్ కార్డులను (SIM Cards) ఉపయోగించి చేస్తున్న మోసాలను అరికట్టేందుకు టెలికాం శాఖ (DoT) సిద్ధమవుతోంది. సిమ్ కార్డ్ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతోంది.
ఈ నిబంధన ప్రకారం అక్టోబర్ 1వ తేదీ నుంచి టెలికాం ఆపరేటర్లు (Telecom operators) రిజిస్టర్డ్ డీలర్‌ల ద్వారా మాత్రమే సిమ్ కార్డ్‌లను విక్రయించాలి. అలా కాకుండా రిజిస్టర్ చేయని డీలర్‌ల ద్వారా సిమ్ కార్డ్‌లను విక్రయిస్తే, రూ.10 లక్షల జరిమానా పడుతుంది. ఈ నిబంధన వల్ల సిమ్ కార్డ్ రీప్లేస్ చేసుకునే సామాన్యులపై కూడా ప్రభావం పడుతుంది.
మోసపూరితంగా, కచ్చితమైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా సిమ్ కార్డులను విక్రయించడాన్ని నిరోధించే లక్ష్యంతో డాట్ ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నెల 30లోపు అని అన్‌రిజిస్టర్డ్ పాయింట్ ఆఫ్ సేల్ (PoS)లను టెలికాం ఆపరేటర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. 2023 సెప్టెంబర్ 30లోపు అన్‌రిజిస్టర్డ్ PoS/రిటైలర్ ద్వారా యాక్టివేట్ అయిన అన్ని మొబైల్ కనెక్షన్లు రీ వెరిఫికేషన్ చేయించుకోవలసి ఉంటుంది. ఇప్పటికే ఉన్న అన్ని PoS వారి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, సెప్టెంబర్ చివరి నాటికి టెలికాం కంపెనీలతో రిజిస్టర్ చేసుకోవాలి (Important alert).
నమోదు అయిన డీలర్స్ మాత్రమే సిమ్ కార్డులు అమ్మే వీలు ఉండడంతో సిమ్‌కార్డులు ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు కొనుగోలు చేస్తున్నారనే విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇక, సిమ్ కార్డులు కొనుగోలు చేసే వ్యక్తులు తమ గురించి గతంలో కంటే ఎక్కువ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఆ సిమ్ కార్డులను వినియోగించడం లేదని డీలర్ నిర్ధారించుకోవడానికి తగినన్ని అధారాలు అందించాల్సి ఉంటుంది. ఇక, సిమ్ పాడైపోయినా లేదా పోగొట్టుకున్నా అదే నంబర్ తిరిగి పొందాలంటే.. కొత్త సిమ్ కొనేటపుడు ఎలాంటి నిబంధనలను పాటించాలో పాత నెంబర్ కోసం కూడా అదే రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అలాగే అధిక మొత్తంలో సిమ్ కార్డులను కోనుగోలు చేయడం ఇకపై కుదరదు.
0 Comments:
Post a Comment