PGCIL Recruitment 2023 : పవర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.లక్షపైనే.. క్వాలిఫికేషన్ ఏంటంటే?
PGCIL Recruitment 2023 : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడులైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుందని పీజీసీఐఎల్ వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PGCIL Recruitment 2023 : న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. తమ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్యాలయాల్లో గేట్-2024 ద్వారా ఇంజినీర్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు సైతం ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగ వివరాలు..
ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్)
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్.
ఖాళీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు వెల్లడి
పీజీసీఐఎల్ రీజియన్: నార్తెర్న్, ఈస్ట్రన్, నార్త్- ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిశా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ సెంటర్.
జీత భత్యాలు..
ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.40,000 స్టైపెండ్ అందుతుంది.
శిక్షణ అనంతరం ఇంజినీర్ ఈ-2 హోదాలో నియమితులవుతారు.
నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వేతనం అందుతుంది.
విద్యార్హత..
PGCIL Recruitment 2023 Age Limit : కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/పవర్ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ గేట్-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయస్సు..
PGCIL Recruitment 2023 Age Limit : 2023 డిసెంబర్ 12 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్..
PGCIL Recruitment 2023 Salary : నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
ఎంపిక ప్రక్రియ..
గేట్ 2024 స్కోర్ ఆధారంగా మొదట గ్రూప్ డిస్కషన్ ఉంటుంది.
తరువాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
అనంతరం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పిలుస్తారు.
మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు రుసుమ..
జనరల్ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు..
PGCIL Recruitment 2023 Apply Online
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2024 జనవరి 16
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 2024 ఫిబ్రవరి 18
0 Comments:
Post a Comment