Nara Lokesh: నారా లోకేష్‌కు స్వల్ప ఊరట.. అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు స్వల్ప ఊరట లభించింది. అక్టోబర్ 4 వరకు అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం నారా లోకేష్ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దని నాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
స్కిల్, ఫైబర్ నెట్ కేసులో లోకేష్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టును ఆశ్రయించారు లోకేష్ తరఫు లాయర్లు. దీంతోపాటు ఫైబర్ నెట్ కేసులోను ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. మరో వైపు.. నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసింది కోర్టు.
బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు. విచారణకు సహకరించాలని లోకేష్‌కు కోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌కు 41A నోటీసులు ఇచ్చింది.. ఆ నోటీసులను ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరింది ఏపీ సీఐడీ. లోకేష్‌ను విచారించేందుకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలిపింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14 గా ఉన్నారు నారా లోకేష్.
ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి తీర్పును వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
0 Comments:
Post a Comment