Google Images History : సామాన్యులు, పొలిటికల్ లీడర్లు, సినిమా యాక్టర్లు, ప్రాంతాలు అసలు గూగుల్‌లో వెతికితే దొరకని ఫోటోలు ఉండవు. ఈజీగా సెర్చ్ చేసి చూసేస్తాం.
2001 వరకు గూగుల్ ఇమేజస్ ఆప్షన్ లేనే లేదు. గూగుల్ ఇమేజస్ అందుబాటులోకి రావడానికి కారణం ఓ ముద్దుగుమ్మ వేసుకున్న గ్రీన్ డ్రెస్. ఎవరా లేడీ? ఆ గ్రీన్ డ్రెస్ హిస్టరీ ఏంటి?
అమెరికన్ పాపులర్ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ గురించి తెలియని వారుండరు. ఈ రోజు మనం గూగుల్‌కి వెళ్లి ఫోటోలు వెతకడానికి కారణం ఈ సెలబ్రిటీనే. 2000 ఫిబ్రవరిలో గ్రామీ అవార్డుల వేడుక జరిగింది.
ఆ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్ గ్రీన్ గౌనులో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈ అందమైన గౌనులో జెన్నిఫర్‌ను చూసిన నెటిజన్లు ఆమె ఫోటో కోసం ఓ రేంజ్‌లో వెతకడం మొదలుపెట్టారు.
నెటిజన్ల వెతుకులాట చూసి గూగుల్ ఆశ్చర్యపోయింది. వెంటనే ఈ సమస్యకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యింది.
గూగుల్ సెర్చింజన్ 1998 లో మొదలైంది. గూగుల్ ఇమేజస్ మాత్రం 2001 జూలై నుండి అందుబాటులోకి వచ్చింది. అదీ జెన్నిఫర్ ఎఫెక్ట్‌తో అన్నమాట.
ఇక ఈ గ్రీన్ గౌను పాపులారిటీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్‌గా ఇటలీలో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో జెన్నిఫర్ కొంచెం మార్పులు చేసిన ఇదే గ్రీన్ గౌనుతో ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసారు.
ఇక జెన్నీ క్యాట్ వాక్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. లక్షలాది మందిని ఆకట్టుకుంది.
0 Comments:
Post a Comment