చేతి వాచీలకు కాలం చెల్లింది.. వేలి వాచీలు వచ్చేస్తున్నాయ్!, చూడండి ఎలా ఉన్నాయో
గడియారాలు అందుబాటులోకి వచ్చిన కొత్తలో వాటిని నడుముకు వేలాడదీసుకునేవారు. కొంతకాలానికి చేతి గడియారాలు వచ్చాక, ముంజేతికి వాచీలు ధరించడం ఫ్యాషన్‌గా మారింది.
మొబైల్‌ఫోన్లు వచ్చాక చేతికి వాచీలు ధరించే ఫ్యాషన్‌కు దాదాపుగా కాలం చెల్లింది.
వాచీల వాడకాన్ని కొత్తపుంతలు తొక్కించడానికి జాపనీస్ కంపెనీ 'క్యాసియో' ఇటీవల 'స్టాస్టో స్టాండ్ స్టోన్స్' సంస్థతో కలసి వేలికి ఉంగరాల్లా తొడుక్కునే ఈ వాచీలను అందుబాటులోకి తెచ్చింది. రకరకాల డిజైన్లు, రకరకాల మోడల్స్‌లో రూపొందించిన ఈ వాచీలను ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసింది.
ఈ వేలి వాచీల్లో క్యాలికులేటర్, డిజిటల్ డిస్‌ప్లే వంటి సౌకర్యాలు కూడా ఉండటం విశేషం. వీటి ధరలు మోడల్స్‌ను బట్టి 3 డాలర్ల (రూ.249) నుంచి మొదలవుతాయి.
0 Comments:
Post a Comment