Tirumala: శ్రీవారి భక్తులకు నేడు అదిరిపోయే శుభవార్త.. మూడు రకాల టికెట్ల విడుదల.. ఏ సమయంలో ఏవి..? ఇలా బుక్ చేసుకోండి..
Good News to Tirumala Devotees: కలియుగ వైకుంఠంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు నేడు అదిరిపోయే శుభవార్త.. ట్రిపుల్ బొనాంజా అని చెప్పాలి..
ఇవాళ మూడు రకాల టికెట్లను.. భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆ మూడు సేవల టికెట్లు ఏంటి.. ఏ సమయంలో ఏవి విడుదల చేయనున్నారు.. పూర్తి వివరాలు చూద్దాం..
నిజంగానే ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ట్రిపుల్ బొనాంజా అని చెప్పాలి.. ఎందుకంటే ఒకే రోజు మూడు టికెట్లను విడుదల చేయనున్నారు.. అందులో ముఖ్యమైనవి అంగప్రదక్షిణ టోకెన్లు. నేటి ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. సాధారణంగానే ఈ టోకెన్లకు చాలా డిమాండ్ ఉంటుంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే బుక్ అయిపోతుంటాయి.. భక్తులు అలర్ట్ గా ఉండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది.
అలాగే ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటా తో పాటు.. ఇవాళ పాటు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక దర్శనం 300 రూపాయల టికెట్లు పొంద లేకపోయిన వారు.. శ్రీవాణి ట్రస్టు ద్వారా బుక్ చేసుకోవాలని.. శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకుంటారు. అందుకే వీటికి డిమాండ్ బాగానే ఉంటోంది.
అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు సేవా టికెట్లు ఉదయం వెంట వెంటనే గంట వ్యవధిలో రిలీజ్ చేస్తారు. ఇక వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఆగస్టు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఈ మూడు సేవల టికెట్లు ఇవాళే అందుబాటులోకి వస్తున్నాయి.
నేడు మూడు రకాల టికెట్లను అందుబాటులోకి తెస్తున్న టీటీడీ.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల ను అందుబాటులోకి తెస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వరుసగా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయుంది.. భక్తులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు..
మరోవైపు తిరుమల, తిరుపతిలలో వసతి గదుల బుకింగ్ ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది. లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డును చూసి.. మీ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన తేదీ స్లాట్ ను చెక్ చేసుకుంటే.. ఖాళీలు ఉంటే.. గ్రీన్ కలర్ కనిపిస్తుంది.
ఆ తర్వాత.. అక్కడ నొక్కితే.. టికెట్ మెుత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. బుకింగ్ ప్రక్రియ.. సాధారణంగా ఇతర వెబ్ సైట్లలో చేసిన విధంగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని తిరుమల వచ్చే భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ కోరుతోంది.
0 Comments:
Post a Comment