SBI Credit Card: ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. బ్యాంక్ కీలక ప్రకటన!
Credit Card | దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ (SBI) కార్డ్ తాజాగా తీపికబురు అందించింది.
కీలక ప్రకటన చేసింది. క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డు తాజాగా యూపీఐ (UPI) క్రెడిట్ కార్డు సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారు కూడా యూపీఐ ద్వారా ఇకపై పేమెంట్లు చేయొచ్చు. అయితే ఈ ఫెసిలిటీ కేవలం కొందరికే వర్తిస్తుంది.
ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డు వాడే వారు వారి క్రెడిట్ కార్డును యూపీఐ యాప్స్‌తో లింక్ చేసుకోవచ్చు. తద్వారా సులభంగానే పేమెంట్లు చేయొచ్చు. ఇప్పటికే చాలా బ్యాంకుల ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చాయి. తాజాగా ఎస్‌బీఐ కూడా ఈ యూపీఐ క్రెడిట్ కార్డు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల రూపే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారు యూపీఐ యాప్స్ ద్వారానే పేమెంట్లు చేయొచ్చు. దీని ద్వారా క్రెడిట్ కార్డు వినియోగం మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు.
కాగా ఇలా యూపీఐ యాప్స్ ద్వారా రూపే క్రెడిట్ కార్డు వాడాలని భావించే వారు కచ్చితంగా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ యాప్స్‌లోకి వెళ్లి క్రెడిట్ కార్డును లింక్ చేసుకోవాలి. తర్వాతనే పేమెంట్లు చేయడం వీలవుతుంది. మీరు మీ డెబిట్ కార్డును ఎలా అయితే యూపీఐ యాప్స్‌తో లింక్ చేసుకుంటారో.. అలానే రూపే క్రెడిట్ కార్డును కూడా అనుసంధానం చేసుకోవాలి.
ఇకపోతే రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ సేవలు పొందాలని భావించే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కేవలం మర్చంట్లకు మాత్రమే పేమెంట్లు చేయడం వీలవుతుంది. అంతేకానీ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వీలు కాదు. అందు వల్ల క్రెడిట్ కార్డు వాడే వారు ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. కాగా ఇప్పటికే పలు బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డు సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల మీరు ఏ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నా కూడా దాని ద్వారా మీరు మర్చంట్లకు యూపీఐ ద్వారా పేమెంట్లు చేయొచ్చు. దీని కోసం క్రెడిట్ కార్డు మీ వద్ద ఉండాల్సిన పని లేదు. అందు వల్ల పేమెంట్లు సులభంగానే పూర్తి చేయొచ్చు.
0 Comments:
Post a Comment