RRC Northern Railway Jobs 2023: పదో తరగతి, ఇంటర్, డిప్లొమా అర్హతతో రైల్వే జాబ్స్.. నార్తర్న్ రైల్వేలో 323 ఉద్యోగాలు..
రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన నార్తర్న్ రైల్వేలో.. 323 అసిస్టెంట్ లోకో పైలట్, ట్రెయిన్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, ఇంజనీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ, మూడేళ్ల డిప్లొమా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 జనవరి 1 నాటికి తప్పనిసరిగా అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆగస్టు 28, 2023ను చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం..
ఏఎల్‌పీ/టెక్నీషియన్ పోస్టుల రాత పరీక్షలో పార్ట్ ‘ఏ’లో మొత్తం 100 ప్రశ్నలకు 90 నిముషాల్లో రాయవల్సి ఉంటుంది. పార్ట్ ‘బి’లో 75 ప్రశ్నలకు 60 నిముషాల్లో పరీక్ష ఉంటుంది.
జూనియర్ ఇంజనీర్ పోస్టులకు 150 మార్కులకు 120 నిమిషాల్లో పరీక్ష ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ, బేసిక కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్ విభాగాల్లో పరీక్ష ఉంటుంది.
0 Comments:
Post a Comment