Rakesh Sharma: అంతరిక్షం నుంచి మన భారతదేశం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించిన ఇందిరా గాంధీకి ఒక్క మాటలో అదిరిపోయే సమాధానం చెప్పిన రాకేష్ శర్మ
Rakesh Sharma- Indira Gandhi: చంద్రునిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసి భారతదేశం చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు సాక్షులుగా నిలిచారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి నుంచే ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇదిలా ఉంటే అంతరిక్షానికి సంబంధించిన అనేక రకాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్షం నుంచి నేరుగా తన మాతృభూమిని సంప్రదించిన క్షణాన్ని కూడా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు.
అయితే ఆ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనను ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. 'అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుందో చెప్పాలి' అని ప్రశ్నించారు.
దీనికి ఆయన సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రాకేశ్ శర్మ భారత వైమానిక దళానికి చెందిన పైలట్, 1984లో అంతరిక్ష యాత్రకు అవకాశం లభించింది, ఆ అవకాశం దక్కిన మొదటి భారతీయుడు ఆయనే.
రాకేష్ శర్మ సోవియట్ యూనియన్ సోయుజ్ T-11 మిషన్‌లో భాగమయ్యారు. ఈ సమయంలో, రాకేష్ శర్మ అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో అంతరిక్షం నుంచే నేరుగా సంభాషించారు.
ఇందిరా, రాకేష్ శర్మ మధ్య జరిగిన సంభాషణ
రాకేష్ శర్మ అంతరిక్షంలోకి చేరుకున్నప్పుడు, ఇందిరా గాంధీ ఆయనతో మాట్లాడుతూ ''దేశం మొత్తం దృష్టి మీపై ఉంది. మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము. ఇది మన దేశానికి అంతరిక్షంపై అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాను'' అని అన్నారు.
ఇక అదే సమయంలో, రాకేష్ శర్మను ఇందిరా కఠినమైన శిక్షణ గురించి ఒక ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా రాకేష్ శర్మ మాట్లాడుతూ.. ఆ శిక్షణ కారణంగానే ఆ రోజు మిషన్‌లో తనకు ఇబ్బంది తక్కువగా ఉందని, చాలా ముఖ్యమైనదని చెప్పారు.
పై నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుంది?
ఈ సంభాషణ చివర్లో అప్పటి ప్రధాని రాకేష్ శర్మతో మాట్లాడుతూ ''మీరు భారతదేశాన్ని పైనుంచి ఎలా చూస్తారు? అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుంది?'' అని ఇందిరాగాంధీ ప్రశ్నించారు.
అందుకే శర్మ స్పందిస్తూ 'సారే జహాన్ సే అచ్చా అని నేను నిస్సంకోచంగా చెప్పగలను' అని చెప్పారు. ఆ తర్వాత ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
దీనిపై శర్మ మాట్లాడుతూ ఇక్కడే ఎక్కువ తింటున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదని సమాధానం ఇస్తున్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ కార్యకర్తలు సహా అనేక మంది షేర్ చేస్తూ ఇతరులతో పంచుకుంటున్నారు.
0 Comments:
Post a Comment