PF Interest 2023 : పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియ మొదలైంది.. ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి!
PF Interest 2023 : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని.. ఉద్యోగుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మొదలు పెట్టింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ "X"లో ఒక ఖాతాదారు పెట్టిన పోస్టుకు ఈపీఎఫ్ఓ స్పందించింది. వడ్డీ జమకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
PF Interest 2022-23 : ఆర్థిక సంవత్సరం 2022-23కు సంబంధించి.. ఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాలని ఈపీఎఫ్ఓ ఈ ఏడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. దీనిపై సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం.. పీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ధారించింది. ఈ మేరకు జూలైలో ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 6 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుందని ఈపీఎఫ్(EPFO) ప్రకటించింది. అయితే.. ఈ వడ్డీని ఉద్యోగుల ఖాతాల్లో ఎప్పుడు జమచేస్తారనే క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా EPFO సమాధానం ఇచ్చింది. "కాస్త ఓపిక పట్టండి. ప్రక్రియ మొదలైంది. త్వరలోనే వడ్డీ జమ అవుతుంది. ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా.. అందరికీ వడ్డీ అందుతుంది." అని పేర్కొంది.
ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..?
Hwo to Check PF Balance : EPFO అందిస్తున్న వడ్డీ ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యిందా లేదా? అనేది తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. ఇందుకోసం మొత్తం నాలుగు మార్గాలు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేదంటే.. మెసేజ్ చేయడం ద్వారా కూడా చూసుకోవచ్చు. కాదంటే.. మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ అమౌంట్ చూసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీ ఖాతాలో వడ్డీ పడిందా లేదా? అన్నది తెలుసుకోవచ్చు.
వెబ్ సైట్లో ఇలా..
Check in EPFO Website :
వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి అనుకునేవారు.. epfindia.gov.inలోకి లాగిన్ అవ్వాలి.
ఇందులో Services అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
అక్కడ ఉన్న ఆప్షన్స్ లో.. "For Employees" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ "Member Pass Book"పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు UAN నంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. ఎంటర్ చేయాలి.
పాస్‌బుక్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ వాటాతోపాటు మీ సంస్థ వాటాతో కలిపి మొత్తం మీ బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది.
SMS ద్వారా అలా..
Check EPFO Balance With SMS :
వైబ్ సైట్ ద్వారా కాకుండా.. సింపుల్ గా SMS ద్వారా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీనికోసం.. ఇప్పటికే మీరు మీ మొబైల్ నంబర్ ను రిజిస్టర్ చేసుకుని ఉండాలి. మీ మొబైల్ నంబర్ నుంచి.. 7738299899 నంబర్ కు "EPFOHO UAN ENG" అని SMS పంపించాలి. అక్కడ మీరు కోరుకునే భాషలో మీకు సమాచారం లభిస్తుంది. ఈ మెసేజ్ సౌకర్యం.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, తమిళం ఇంకా బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంది.
మిస్డ్ కాల్ ద్వారా ఇలా..
Check EPFO Balance With Missed Call :
SMS ద్వారా కాకుండా.. కేవలం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ వెంటనే మీ నంబర్‌కు EPFO నుండి మెసేజ్ వస్తుంది. అందులో మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.
ఉమంగ్ యాప్ ద్వారా..
Check EPFO Balance With Umang App :
పై మూడు పద్ధతులతోపాటు UMANG యాప్ ద్వారా కూడా మీ EPFO బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
దీనికోసం UMANG యాప్ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత Employee Centric Services పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత View Passbook ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీ UAN నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు OTP వస్తుంది.
దాన్ని ఎంటర్ చేయడం ద్వారా మీ EPFO బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment