Mango Leaves Benefits: మామిడి ఆకులతో టైప్ 2 షుగర్ కు ఇలా చెక్ పెట్టండి!!
అరవైలు పైబడిన వారికే కాదు.. ఇప్పుడు 20 ఏళ్లు దాటిన వారిని కూడా షుగర్ వ్యాధి భయపెడుతుంది. కారణం.. సరైన ఆహారం తీసుకోకపోవడం. ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు, ఐస్ క్రీమ్ లు, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం.
శరీరానికి కావలసిన పోషకాలను సరైన మోతాదులో అందించకుండా అధిక కేలరీలున్న ఫుడ్ తింటూ.. వాటిని కరిగించకపోవడం, ఎక్కువసేపు మేల్కొని ఉండటంతో నాలుగు పదులైనా దాటకుండానే టైప్ 2 షుగర్ వ్యాధిన పడుతున్నారు. దీంతో ఆ తర్వాత చాలా అవస్థలు పడాల్సి వస్తుంది.
టైప్ 2 డయాబెటీస్ వస్తే.. అతిదాహం, ఆకలి, చేతులు పాదాల్లో సూదులతో గుచ్చినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల కిడ్నీలు, లివర్, కళ్లు దెబ్బతింటాయి. షుగర్ వ్యాధికి తిప్పతీగ పొడి మంచి ఔషధం అని గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండే మామిడి చెట్టు ఆకులతో షుగర్ ను ఎలా కంట్రోల్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి మామిడి ఆకులతో అని షాక్ అవుతున్నారా. మామిడి ఆకుల్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.
బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. 10-15 బాగా ముదిరినవి కాకుండా.. బాగా లేతగా ఉన్నవి కాకుండా ఉన్న మామిడి ఆకులను తీసుకుని దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా కడగాలి.
-ఈ ఆకులన్నింటినీ ఒక పాత్రలో వేసి.. ఒక గ్లాసు నీరు పోసి మరిగించి.. ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా వారానికి 3-4 సార్లు తాగితే.. క్రమంగా షుగర్ కంట్రోల్ అవుతుంది.
-అలాగే మామిడి ఆకులను ఎండబెట్టి.. పొడి చేసుకుని.. రోజుకు రెండుసార్లు అర టీస్పూన్ మోతాదులో గోరువెచ్చని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు నెలలు క్రమం తప్పకుండా తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
-ఆస్తమా, బ్రాంకైటిస్, వెరికోస్ వీన్స్ వంటి సమస్యలను కూడా తగ్గించడంలో మామిడి ఆకుల కషాయం బాగా ఉపయోగపడుతుంది.
0 Comments:
Post a Comment