గుండెకు మేలు చేసే ఈ పండు.. చెడు కొలెస్ట్రాల్ ని ఐస్ లా కరిగిస్తుంది..
ఈ పండు పేరు కరంచా పండు( Karonda ) అని చాలామందికి తెలియదు. దీన్ని కరంచా, కొరొంచా, కొరొండా, కరిస్సా వంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో ఈ పండును అమ్ముతున్నారు.
డ్రై ఫ్రూట్స్ లాగా కూడా ఇది లభిస్తూ ఉంది. నిజానికి ఇది బెంగాల్లో కనిపించే పండు. అక్కడి మార్కెట్లో గ్రామాలలో దీన్ని చూసే అవకాశం ఉంటుంది. ఇది చిన్నగా, పుల్లగా ఉండే పండు.
దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు వేసవి, వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ పండు ఎరుపు, గులాబీ, తెలుపు రంగులలో ఉంటుంది. కరంచా పండు మన ఆరోగ్యాన్ని ఎంతో బాగా రక్షిస్తుంది.
అలాగే రకరకాల వ్యాధుల్ని నయం చేస్తుంది.
ఉదాహరణకు కరంచా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్( Bad Cholesterol ) స్థాయిలు తగ్గుతాయి. ధమనులలో రక్తప్రసరణ సాధారణంగా ఉంటుంది. తద్వారా గుండే జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది.అధిక బరువు ఉండేవారు ఈ పండును తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ పండు శరీరంలో కొవ్వును ఐస్ లాగా కలిగిస్తుంది.
అలాగే ఇది పొట్ట సంబంధిత వ్యాధుల( Digestive problems ) నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా పచ్చి కరంచా తినడం వల్ల దంతాలు, చిగుళ్ళు బలపడతాయి. కరంచాలో విటమిన్ బి,సి తోపాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్లు, క్యారిసోన్స్, ట్రైటెర్పెనాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ పండుగకి ఎంతో డిమాండ్ ఉంది. ధర కూడా ఎక్కువే. 100 గ్రాములు ప్యాకెట్ 70 రూపాయల పైనే ఉంటుంది. ఈ పండు పుల్లని రుచిని కలిగి ఉంటుంది.
అయితే కాలేయం, మూత్ర పిండాల సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా కరంచాను తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కరంచాలో ఉండే రాగి కొల్లాజన్( Collagen ) ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇది చూడడానికి చెర్రీ పండులా కనిపించినప్పటికీ రుచి వేరుగా ఉంటుంది.
0 Comments:
Post a Comment