Betel Leaf : ఒక్క ఆకుతో 100 అద్భుతాలు. తమలపాకు సీక్రెట్.
Betel Leaf : మొక్కలు అనేవి చాలా ప్రత్యేకమైనవి.. అయితే ఇవన్నీ మనిషి గనుక సరిగా ఉపయోగించుకుంటే ఏ రోగాలు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.. కాకపోతే వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు ఎవరికీ తెలియక ప్రకృతిని సరిగా వినియోగించుకో లేకపోతున్నామనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఖరీదు పెట్టి పళ్ళు ఖరీదైన డ్రై ఫ్రూట్స్ రకరకాల హెల్త్ డ్రింకులు తీసుకుంటాం..
కానీ మన కళ్ళముందే. మనకి బాగా అందుబాటులో ఉండే ఔషధాల మొక్క గురించి అంతగా పట్టించుకోము.. ఆకోవకు చెందింది తమలపాకు. ఈ ఆకుకి మన పూర్వీకులు ఇచ్చిన స్థానం కొన్ని సందర్భాల్లో అగ్ర తాంబూలం అనే మాట కూడా వాడుతుంటారు. దీనిలో ఉండే ఔషధ గుణాలను బట్టి తమలపాకుని అగ్రస్థానంలోనే ఉంచొచ్చు. ఆయుర్వేద వైద్య ప్రకారం తమలపాకుని చాలా రకాల రోగాలు నయం చేయడంలో కూడా వినియోగిస్తుంటారు. మన ఆరోగ్యం అంత ఒక చిన్న కిటుకులోనే ఉంటుంది. అదే అరుగుదల శక్తి. తిన్న ఆహారం సరిగా అరిగిపోయి ఏ రోజు వ్యర్ధాలు ఆరోజు బయటకు విసర్జించగలిగిన వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉంటాడు.
ఇలా జరగనివాళ్లే అనారోగ్యం బారిన పడుతుంటారు. సింపుల్ గా చెప్పాలంటే అరుగుదల శక్తి బాగున్న ప్రతి వ్యక్తికి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటారు. మరి ఈ తమలపాకులు ఎలా వినియోగిస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎటువంటి రకాల వ్యాధులకు తమలపాకును ఎలా వినియోగించాలి అనే విషయాలు పూర్తిగా ఈ చూద్దాం.. ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం తిన్న ఆహారం అరక్కుండానే మళ్లీ మళ్లీ తింటూ ఉండడం అరుగుదల శక్తి లేదు అని తెలిసిన సరే నోటికి రుచిగా ఉంటుందని జంక్ ఫుడ్స్ ను తరచుగా తినడం వీటివల్ల వ్యాధులను మనం కోరు తెచ్చుకుంటున్నాం. ఈరోజుల్లో ఏ చిన్న వ్యాధి వచ్చిన ప్రతి నెల మంగళ దుకాణం చుట్టూ తిరగాల్సింది. అందుకే గోరుతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోకుండా మన కళ్ళముందే మన చుట్టూ పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అలాంటి ఔషధ గుణాలున్న ఆకులు తమలపాకు ఒకటి. వీటిలో కాల్షియం ఇనుము విటమిన్ సి పీ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
మన పూర్వీకులు ఈ తమలపాకులు ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడివారని భోజనమైన వెంటనే ఈ తమలపాకును నమలడం ఎక్కువగా చాలా మందికి అలవాటు ఉండేది. అలాగే అరుగుదల శక్తి కోసం కూడా ఈ తమలపాకును అంటే కిల్లి రూపంలో ఇస్తూ ఉంటారు. చర్మ సమస్యలతోనూ పోరాడుతుంది. తమలపాకులో దగ్గు, జలుబుకు సంబంధించిన సమస్యల చికిత్సకు వాడతారు. మీరు కొన్ని ఆకులను నీటిలో ఉడకబెట్టి రెండు కప్పుల నీటిలో యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి నీరు సగానికి అయ్యేవరకు మరిగించండి. రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మొటిమలు, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
ప్రతిరోజు తమలపాకును 10 గ్రాముల మిరియాలు కలిపి తినడం వల్ల మీరు ఎంత బరువున్న సరే చక్కగా తగ్గిపోతారు. తమలపాకు రసంలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. చిన్నపిల్లలు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు తమలపాకుని వేడి చేసి ఆముదంతో చేర్చి మీద ఉంచితే జలుబు కూడా తగ్గుతుంది. తమలపాకు పేస్టుని తలకు పట్టించుకుని రెండు మూడు గంటల తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి విముక్తు లబిస్తుంది.
0 Comments:
Post a Comment