karnataka : చిరుతపులికే చుక్కలు చూపించాడు.. బైక్‌కి కట్టేసి అధికారులకు అప్పగించిన యువకుడు
Karnataka : చిరుతపులిని చూస్తే ఆమడ దూరం పరుగులు పెడతాం. ఇక దానితో తలపడటం అంటే.. సినిమాల్లో చూడటమే. ఇప్పుడు చెప్పబోయే ఓ వ్యక్తి పెద్ద సాహసం చేశాడనే చెప్పాలి.
తనపై దాడి చేసిన చిరుతతో భీకర పోరాటం చేశాడు.. ఆ తరువాత ఏం జరిగింది అంటే?
గ్రామాల్లోకి చిరుతపులులు రావడం.. జనాల్ని బెంబేలెత్తించిన ఘటనలు అనేకం చూస్తూ ఉంటాం. వాటికి భయపడి ఇళ్లలోంచి బయటకు రాకపోవడమో అటవీ అధికారులకు ఫిర్యాదులు చేయడమో చేస్తారు. కానీ ఓ యువకుడు సినిమాల్లో మాదిరిగా పెద్ద సాహం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చిరుత అతనిపై దాడికి దిగింది. అతను వెనక్కి తగ్గలేదు. దాంతో తలపడ్డాడు. ఒంటిపై గాయాలవుతున్నా లెక్క చేయలేదు. మొత్తానికి దాంతో పోరాడి గెలిచాడు. చిరుతపులి కాళ్లు, చేతులు కట్టేసి బైక్ వెనుక భాగంలో బిగించి తీసుకెళ్తుంటే గ్రామస్తులు చూసి ఉలిక్కిపడ్డారు.
చేతుల నిండా చిరుత చేసిన గాయాలున్నా లెక్క చేయకుండా దానిని అటవీ అధికారులకు వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు ముత్తు. ఇక అతనిని చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కర్నాటకలో సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
0 Comments:
Post a Comment