Soya Beans: సోయాబీన్స్ గురించి దిమ్మతిరిగిపోయే నిజాలు.. మహిళలకు ఏకంగా ఇన్ని లాభాలా??
సోయాబీన్స్ భారతీయుల ఆహారంలో తక్కువగా ఉపయోగిస్తుంటారు. మరీ అంత రుచిగా లేకపోవడం, వగరుగా ఉండటం వల్ల సోయా తినడానికి పెద్దగా ఇంటరెస్ట్ చూపించరు. కానీ ఇది ఎక్కువ ప్రోటీన్స్ కలిగిన ఆహారం.
మాంసాహరంతో సమానమైన పోషకాలు సోయా బీన్స్ లో ఉంటాయి. గుండె ఆరోగ్యం కాపాడటంలోనూ, బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణంలోనూ, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలోనూ ఇలా సోయాబీన్స్ తీసకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. సోయా పిండిని రొట్టెలలోనూ, సోయాతో తయారు చేసే మీల్ మేకర్ ను మాంసాహారానికి రిప్లేస్మెంట్ గానూ తీసుకుంటారు. ఇక వేగన్ లు సోయా పాలను సాధారణ పాలకు బదులుగా వాడుతుంటారు. కానీ సోయాబీన్స్ మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా చేకూర్చే లాభాలు ఉన్నాయి. వీటి గురించి తెలిస్తే కచ్చితంగా షాకవుతారు.
సోయాబీన్ లో ఈస్ట్రోజెన్ హార్మోన్(estrogrn hormone) తయారుచేసే పదార్థం ఉంటుంది. ఈ కారణంగా ఇది మహిళల్లో హార్మోన్స్ సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సోయాను రెగులర్ గా తీసుకుంటూ ఉంటే మహిళలకు పీరియడ్స్ సక్రమంగా వస్తాయి(periods). నెలసరి ముందు,నెలసరి సమయంలో ఎదురయ్యే కండరాల తిమ్మిరి, కడుపు నొప్పి వంటిని తగ్గిస్తుంది(periods pain, muscle cramps). పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎదురయ్యే డిస్మెనోరియా(dysmeonorrhea) అనే సమస్య ఎదురవుతూ ఉంటుంది. గర్భాశయంలో విపరీతమైన నొప్పి ఉండటమే ఈ సమస్య. సోయాబీన్స్ తరచుగా తీసుకుంటూ ఉంటే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక సోయాబీన్స్ ను తీసుకునే మహిళలు 45ఏళ్ళ వయసులో కూడా గర్భం ధరించగరని(women become mother at 45 years age) వైద్యులు చెబుతున్నారు. అయితే సోయాబీన్స్ తీసుకోవడంలో జాగ్రత్తలు చాలా అవసరం.
సోయాబీన్స్ లో యాంటీ న్యూట్రియల్(anti neutral) కారకాలు ఉంటాయి. ఇవి సోయాబీన్స్ జీర్ణం కావడంలో ఇబ్బంది కలిగిస్తాయి. ఈ కారణంగా సోయాను ప్రాసెస్ చేయడం చాలా ముఖ్యం.
సోయాబీన్స్ ను వండుకోవడానికి ముందు 10నుండి 12గంటల సేపు నీటిలో నానబెట్టాలి. (soak 10-12 hrs)
ఇలా నానబెట్టిన సోయాబీన్స్ ను ప్రతి 2నుండి 3గంటలకు ఒకసారి కడిగి ఆ నీటిని మారుస్తూ ఉండాలి.
సోయాబీన్స్ తో పిండి తయారుచేసేముందు సోయాబీన్స్ ను లైట్ గా వేయించి చల్లారిన తరువాత పిండి పట్టించుకోవాలి. ఇవి ఫాలో అయితే సోయా జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తవు. మహిళలు మీల్ మేకర్ కంటే సోయాబీన్స్ ను జాగ్రత్తగా వాడటం మంచిది.
0 Comments:
Post a Comment