Shani Graham - శని దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉండే అదృష్ట రాశులు ఇవే..
వేద జ్యోతిష్య శాస్త్రంలో( Vedic Astrology ) గ్రహాల గమనాన్ని బట్టి ద్వాదశ రాశుల వారి జాతకాలు ఉంటాయి. ఇక ఒక్కొక్క గ్రహం కొన్ని రాశుల వారికి అనుకూలంగానూ, కొన్ని రాశుల వారికి ప్రతికూలంగానూ ఉంటాయి.
సూర్యుడు మొదలుగా గల తొమ్మిది గ్రహాలు వివిధ రాశుల పై తమ అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి. గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే శని అనుగ్రహం( Shani ) ఏ రాశి వారిపై ఉంటుంది. అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే తుల రాశి వారికి శని దేవుడు అనుకూలంగా ఉంటాడు. తుల రాశి వారికి ఎప్పుడూ శని దేవుడు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శని దేవుడి దయ వారి అన్ని ప్రయత్నాలను ఫలించేలా చేస్తుంది. తుల రాశి ( Libra )వారు కష్టపడి పనిచేసే వారిగాను, నిజాయితీపరులుగాను, శ్రద్ధ కలిగిన వారిగాను, దయ కలిగిన వారిగా ఉంటారు. తుల రాశి వారు శని ఆశీర్వాదంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వారి జీవితంలో శ్రేయస్సు, సంతోషం శని దేవుడి దయ వల్ల ఎప్పుడూ ఉంటుంది.
అలాగే కుంభరాశి( Aquarius ) వారిపై శని దేవుడు తన అనుగ్రహాన్ని ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు. శని దేవుడి దయవల్ల కుంభరాశి వారిలో స్వభావికంగా సద్గుణం, నీతి, నిజాయితీ, సహనం ఉంటాయి. వీరు చాలా అరుదుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. శని దేవుడి దయతో వారు అన్ని పనులలోను విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం గుర్తింపును పొందుతారు. వీరిపై శని దేవుడి చెడు ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే శని దేవుడి దయ మకర రాశి( Capricorn ) వారి పై కూడా ఎప్పుడూ ఉంటుంది. మకర రాశికి అధిపతి శని దేవుడు కాబట్టి మకర రాశి వారు నిరంతరం శని దేవుడి అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఎప్పుడు శని దయ వల్ల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వారు ఏ పని చేసినా ఎటువంటి అడ్డంకులు ఉండవు. దీని వల్ల మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు.
0 Comments:
Post a Comment