Sambar Health Benefits। సాంబార్ తినండి, దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!
Sambar Health Benefits: సాంబార్ మనందరికీ ఎంతో ఇష్టమైన వంటకం. ముఖ్యంగా దక్షిణ భారతీయ వంటకాల్లో సాంబార్ కచ్చితంగా అగ్ర స్థానంలో ఉంటుంది. ఉదయం ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలు తినడానికైనా, మధ్యాహ్నం భోజనంలో అయినా, పెళ్లిళ్లు పెరంటాలలోనైనా సాంబార్ ఉండాల్సిందే.
సాంబార్ ఘుమఘుమలకు ఎల్లలు లేవు, దీని రుచికి ప్రపంచంలోని ఎంతో మంది ఫిదా అయ్యారు. సాంబార్ కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఇది ఎన్నో పోషక విలువలు కలిగినది, దీని తయారీలో ఉపయోగించే కూరగాయలు, మసాలా దినుసులు మీకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీ జీర్ణక్రియకు సహాయం చేయడం మొదలుకొని, మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు సాంబార్ తినడం అనేక విధాల మేలు చేస్తుంది. మీ ఆరోగ్యంకు సంబంధించి సాంబార్ తినండం వలన కలిగే ఐదు విశేషమైన ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
1. పోషకాలు సమృద్ధిగా
సాంబార్ అనేది ఆరోగ్యకరమైన కాయధాన్యాలు, కూరగాయల సంపూర్ణ కలయిక, ఇది మీ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లను అందిస్తుంది, మీ అద్భుతమైన పోషణను అందజేస్తుంది.
2. జీర్ణక్రియకు మేలు
సాంబార్‌లో ఉపయోగించే కాయధాన్యాలు, మసాలా దినుసుల కలయిక జీర్ణక్రియకు మేలు చేస్తుంది, ఆరోగ్యకరమైన పేగు కదలికలకు, పేగు ఆరోగ్యానికి దోహదం చేస్తుంది, ఎలాంటి జీర్ణ సమస్యలనైనా నివారిస్తుంది.
3. రోగనీరోధక శక్తికి
సాంబార్ తయారీలో వాడేటువంటే పసుపు, కరివేపాకు వంటి మూలకాలు మీ రోగనిరోధక శక్తిని పెంచే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మిమ్మల్ని అనేక అనారోగ్యాల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
4. గుండెకు ఆరోగ్యం
కాయధాన్యాలు, కూరగాయలు తినడం గుండెకు ఆరోగ్యకరం. వీటిలో ప్రోటీన్లు ఉంటాయి, అనవసరమైన కొవ్వులు ఉండవు. కాబటి సాంబార్ హృదయానికి ఒక మంచి పోషకాహారం. సమతుల్య ఆహారంలో భాగంగా సాంబార్ తీసుకుకోవడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
5. బరువు నియంత్రణ
సాంబార్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది, అధిక బరువును నియంత్రించాలనే లక్ష్యంతో ఉన్నవారికి ఇది సంతృప్తికరమైన భోజనం. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది, అసమయ ఆకలి బాధలను తీరుస్తుంది.
0 Comments:
Post a Comment