NVS Recruitment: నవోదయలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా..
ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నవోదయ విద్యాలయ సమితి(NVS) భారీ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. ఎన్వీఎస్ మొత్తం 7,500 పైగా టీచింగ్, నాన్-టీచింగ్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ navodaya.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా నవోదయ విద్యాలయ సమితి వివిధ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ప్రధానంగా పీజీటీ(కంప్యూటర్ సైన్స్), పీజీటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్), పీజీటీ(మోడరన్ ఇండియన్ లాంగ్వేజ్), టీజీటీ(ఆర్ట్), టీజీటీ(కంప్యూటర్ సైన్స్), కేటరింగ్ సూపర్‌వైజర్, ఎలక్ట్రిన్ సూపర్ వైజర్ వంటి పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.
అర్హత ప్రమాణాలు
పీజీటీ(కంప్యూటర్ సైన్స్)
ఈ ఉద్యోగాల్లో 306 భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. B.Ed కూడా తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.
పీజీటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్)
ఈ పోస్ట్‌లు 91 భర్తీ కానున్నాయి. అభ్యర్థులు M.P.Ed క్వాలిఫై అయి ఉండాలి. వారి వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.
PGT (మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్)
ఈ విభాగంలో భర్తీ కానున్న పోస్టులు 46. సంబంధిత సబ్జెక్ట్‌ల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. B.Ed కూడా పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.
టీజీటీ (కంప్యూటర్ సైన్స్)
భర్తీ కానున్న పోస్టులు 649 కాగా, కంప్యూటర్ సైన్స్‌లో బీసీఏ/బీఎస్సీ చదివి ఉండాలి. లేదా బీటెక్‌లో సీఎస్/ఐటీ పూర్తిచేసి ఉండాలి. బీఈడీ, సీటెట్ తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.
టీజీటీ(ఆర్ట్)
ఈ విభాగంలో 649 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఫైన్ ఆర్ట్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఈడీ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.
టీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్)
భర్తీకానున్న పోస్టులు 1244. దరఖాస్తుదారులు B.P.Ed పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.
టీజీటీ(మ్యూజిక్)
అభ్యర్థులు మ్యూజిక్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వారి వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. భర్తీకానున్న పోస్టులు 649. ఇంకా చాలా రకాల పోస్టులను నవోదయ విద్యాలయ సమితి భర్తీ చేయనుంది. పోస్ట్‌ను బట్టి అర్హత ప్రమాణాలు, వయో నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి.
అప్లికేషన్ ప్రాసెస్
Step 1: ముందు నవోదయ విద్యాలయ సమితి అధికారిక పోర్టల్ navodaya.gov.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 2: అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి.
Step 3: అన్ని పోస్టుల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న దానికి అప్లై చేసుకోవాలి.
Step 4: అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపికలో ముందు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ నవోదయ విద్యాలయ త్వరలో ప్రకటించనుంది.
జీతభత్యాలు
టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థుల జీతం నెలకు రూ.18,000 నుంచి ప్రారంభమవుతుంది.
0 Comments:
Post a Comment