Niharika Chaitanya: విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య
నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela), చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు.
ఈ మేరకు వారిద్దరూ విడాకులు (Niharika Chaitanya gets Divorced) తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో ఇందుకోసం దరఖాస్తు చేసుకోగా, నెలరోజుల కిందటే కోర్టు విడాకులను మంజూరు చేసింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడిపోయేందుకు సిద్ధపడ్డారని సినీ వర్గాల్లో ప్రచారం సాగింది. తాము కలిసి దిగిన ఫొటోలను ఇరువురు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. మరోవైపు, మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరుకావడం చర్చకు దారి తీసింది. వీటిపై ఎవరూ స్పందించలేదు.
నటుడు, నిర్మాత నాగబాబు తనయ అయిన నిహారిక, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు 2020 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది.2020 డిసెంబరులో జరిగిన వీరి పెళ్లికి రాజస్థాన్ ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్ వేదికైంది. వివాహానంతరం సినిమాలకు దూరమైన నిహారిక 'డెడ్ పిక్సెల్స్' (Dead Pixels) వెబ్‌సిరీస్‌తో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు.
0 Comments:
Post a Comment