New Scheme: కొత్తగా బైక్, స్కూటర్, కారు కొనే వారికి గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త స్కీమ్?
Electric Vehicles | మీరు కొత్తగా కారు కొనుగోలు చేయలని భావిస్తున్నారా? లేదంటే టూవీలర్ కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకుంటే కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ (Scheme) తీసుకువచ్చే పనిలో ఉందని తెలుస్తోంది.
ఫేమ్ 3 స్కీమ్‌పై మోదీ (Modi) సర్కార్ పని చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీని వల్ల వాహన కొనుగోలు దారులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫేమ్ 3 స్కీమ్‌పై పని చేస్తోందని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈసారి హైబ్రిడ్ వెహికల్స్‌కు అధిక ప్రాధాన్యం లభించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుకు సబ్సిడీ లభిస్తోంది. ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ స్కూటర్ , ఎలక్ట్రిక్ బైక్ , ఎలక్ట్రిక్ ట్రక్కులు వంటి వాటి కొనుగోలుపై సబ్సిడీ రూపంలో తగ్గింపు లభిస్తోంది. ఫేమ్ 1 స్కీమ్ కింద కూడా ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండేది.
అయితే ఇప్పుడు ఫేమ్ 3 స్కీమ్‌లో ప్రత్యామ్నాయ ఫ్యూయెల్ వెహికల్స్‌కు అధిక ప్రాధాన్యం లభించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. హైబ్రిడ్ వెహికల్స్ కొనుగోలుపై సబ్సిడీ పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఫెసిలిటీ అందుబాటులో లేదు. అందుకే కొత్త స్కీమ్ ద్వారా హైబ్రిడ్ వెహికల్స్ అమ్మకాలను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ త్రివీలర్స్ వంటి వాటికి ఫేమ్ 3 స్కీమ్‌లో సబ్సిడీ ఎక్కువగా ఉందొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఫేమ్ 1, ఫేమ్ 2 స్కీమ్స్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్లకు అధిక ప్రాధాన్యం లభించింది. వీటికి ప్రారంభంలో 40 శాతం వరకు సబ్సిడీ వచ్చింది. అయితే ఫేమ్ 2 స్కీమ్‌లో ఈ సబ్సిడీని 15 శాతానికి తగ్గించారు. అయితే ఫేమ్ 1, 2 స్కీమ్స్‌లో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లకు ఎక్కువ ప్రోత్సాహం లభించ లేదని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఫేమ్ 3 స్కీమ్ కింద ప్రభుత్వం వీటికి అధిక ప్రోత్సాహం అందించే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అందువల్ల కొత్త స్కీమ్ అందుబాటులోకి వస్తే.. కారు కొనే వారికి అధిక ప్రయోజనం కలుగుతుంనది చెప్పుకోవచ్చు. ఇక టూవీలర్లకు కూడా సబ్సిడీ లభించొచ్చు. అయితే గతంలో కన్నా తక్కువ బెనిఫిట్ ఉండొచ్చు. అందువల్ల మీరు ఎలక్ట్రిక్ టూవీలర్ కొనే ప్లానింగ్‌లో ఉంటే ఫేమ్ 2 స్కీమ్ ఉన్నప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమం.
0 Comments:
Post a Comment