ఈరోజు విద్యాశాఖ మంత్రి గారితో జరిగిన చర్చలు ముఖ్యంశాలు
💥 త్వరలో హై పవర్ కమిటీ ద్వారా అర్హత గల ఉపాధ్యాయులు వారి యొక్క విల్లింగ్ తో ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఆన్లైన్లో ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు పాఠశాల సమయం తరువాత బోధించుటకు అవకాశం కల్పిస్తారు దానికి వచ్చే రెమ్యూనరేషన్ ఉపాధ్యాయులు మరియు ఆ పాఠశాలకు ఖర్చు పెట్టుకోవచ్చు.
💥భర్తీ కాకుండా మిగిలిపోయిన ఎంఈఓ-1పోస్టులను అర్హత గల Zp ప్రధానోపాధ్యాయులకు ఇవ్వమని కోరాము దాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
💥 ప్రస్తుతానికి ఎంఈఓ-2 22 పోస్టులు ఎంఈఓ- 1 160 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
💥 అదే విధంగా డివైఈవో పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి పోగా మిగిలినవి ఉమ్మడి సీనియార్టీ ద్వారా అర్హత గల ఎంఈఓ -1&2 ల నుండి భర్తీ చేయమని కోరాము.
అదే విధంగా మున్సిపాలిటీలలో అర్బన్ విద్యాశాఖ అధికారి పోస్టులు సర్వీస్ రూల్స్ వచ్చిన తదుపరి భర్తీ చేయమని కోరాము మరియు అర్బన్ హై స్కూల్స్ లో సీనియర్ హెచ్ఎం ల నుండి వీటిని భర్తీ చేస్తారు అంతే కాకుండా కొత్తగా అర్బన్ రెవెన్యూ మండలాలుగా పరిగణి పరిగణించనున్న సుమారు 6 కొత్త అర్బన్ రెవెన్యూ మండలాలను కూడా పరిగణలోకి తీసుకొని వాటికి కూడా urban educational officers 1&2 పోస్టులను అర్బన్ పరిధిలోని సీనియర్ హెడ్మాస్టర్ కు ఇస్తారు.
💥 137 కంటే తక్కువ roll ఉన్న పాఠశాలకు హెడ్మాస్టర్ పోస్టులు కేటాయించాలని కోరాము దీన్ని పరిశీలిస్తామని చెప్పారు.
💥 యూపీ పాఠశాలలో కొత్తగా మూడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చే నేపథ్యంలో అక్కడ ఎస్జిటీలను బయటకు పంపించే పరిస్థితి వస్తే వారికి అదే మండలంలోని బ్లాక్ చేసిన ఎస్జిటి పోస్టులు ఇవ్వాలని కోరాము.
💥 పదోన్నతి అన్విల్లింగ్ ఇచ్చి 2వ సబ్జెక్టుకు అర్హత కలిగి ఉంటే వారికి ఒక సంవత్సరం ఆగవలసిన అవసరం లేకుండా రెండవ సబ్జెక్టు పదోన్నతికి అర్హత ఉంటే అవకాశం కల్పించాలని కోరాము దానిని పరిశీలిస్తామని చెప్పారు.
💥 కొత్తగా ఇవ్వబోయి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు అవసరమైన ఖాళీలను మాత్రమే చూపిస్తారు.
💥త్వరలో అకాడమిక్ విషయాలపై SCERT ద్వారా ఒక మీటింగ్ ను నిర్వహించి అకాడమిక్ విషయాలను చర్చిస్తారు.
0 Comments:
Post a Comment