Central Bank of India Jobs: ఆకర్షణీయ జీతంతో.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న పలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ బ్రాంచుల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో 1000 మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జులై 15, 2023వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
ఐతే ఎంబీఏ/ఎంసీఏ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణుతోపాటు అనుభవం కూడా ఉండాలి. పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్లు లేదా పీఎస్‌బీ/ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ఆర్‌ఆర్‌బీలో కనీసం ఆరేళ్లు క్లర్క్‌గా పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా మే 31, 2023వ తేదీ నాటికి 32 యేళ్లకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు సమయంలో జనరల్ రూ.850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్ధులు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆగస్టు 2వ వారంలో లేదా 3వ వారలో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
0 Comments:
Post a Comment