CAPF jobs:36వేలు భర్తీ చేశాం.. ఇంకా 80వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది: కేంద్రం
కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు(CAPF)లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత తొమ్మిది నెలల్లో బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ వంటి విభాగాల్లో 36,521 పోస్టులను భర్తీ చేయగా..
ఇంకా దాదాపు 80వేల పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీఏపీఎఫ్‌లు, అస్సాం రైఫిల్స్‌లో సిబ్బంది నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం డ్రైవ్ ప్రారంభించిందన్న ఆయన.. తొమ్మిది నెలల్లోనే 36,521 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు.
ప్రస్తుతం మరో 79,960 ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ వివిధ దశల్లో ఉందని చెప్పారు. ఉద్యోగ ఖాళీలను సత్వరమే భర్తీ చేసేలా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. కానిస్టేబుళ్ల వార్షిక రిక్రూట్‌మెంట్, నియామక ప్రక్రియను సమన్వయం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నామినేట్ చేయడంతో పాటు భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యల్నింటినీ కేంద్రం ఎప్పటికప్పుడు చేపడుతున్నామన్నారు.
0 Comments:
Post a Comment