Birth Certificate: బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. ఏ డాక్యుమెంటైనా ఈజీగా పొందొచ్చు, కేంద్రం కొత్త బిల్లు!
Birth Certificate Apply | మన దేశంలో చాలా రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆధార్ కార్డు (Aadhaar), పాన్ కార్డు, డ్రైవింగ్ లెసెన్స్ (Driving Licence), మ్యారేజ్ సర్టిఫికెట్ ఇలా చాలా రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని మనకు తెలుసు.
ఒక్కో డాక్యుమెంట్2కు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మీరు పాన్ కార్డు పొందాలంటే ఒక రకమైన డాక్యుమెంట్లు అందించాలి. అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ పొందాలంటే వేరే డాక్యుమెంట్లు ఆవ్వాల్సి ఉండొచ్చు. ఇలా పలు రకాల డాక్యుమెంట్లు కలిగి ఉండాలి. ఇంట్లో ఒక్కోసారి ఏ ఏ డాక్యుమెంట్లు ఉన్నాయో కూడా మనకు గుర్తుకు ఉండదు. అవసరం పడినప్పుడు మాత్రం వెతికేస్తూ ఉంటాం. అప్పుడు కొన్ని దొరకొచ్చు. మరికొన్ని ఉండకపోవచ్చు. ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి.
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగే ప్రకటన చేసింది. కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీని వల్ల ప్రజలకు చాలా ఊరటగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బర్త్ సర్టిఫికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం లోక సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా ఉపయోగించేలా ఈ బిల్లును రూపొందించారు. అంటే మీరు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా, ఓటర్ ఎన్‌రోల్‌మెంట్, ఓటర్ లిస్ట్ రూపొందించడం, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ జాబ్ అపాయింట్‌మెంట్ ఇలా దేనికైనా సరే బర్త్ సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకోనున్నారు.
ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) బిల్లు 2023ను కేంద్రం తీసుకువచ్చింది. దీని ద్వారా నేషనల్, స్టేట్ లెవెల్ డేటా బేస్ ఏర్పాటుకు సహాయపడుతుంది. దీని వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం వీలవుతుంది. అలాగే పారదర్శకత వస్తుంది. ఈ కొత్త బిల్లు వల్ల డిజిటల్ రిజిస్ట్రేషన్, ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫర్ సర్టిఫికెట్ ఆఫ్ బర్త్స్, డెత్స్ సాధ్యం అవుతుంది. అలాగే మీరు ఏ డాక్యుమెంట్ పొందాలన్నా బర్త్ సర్టిఫికెట్ ద్వారా పొందే వెసులుబాటు ఉంటుంది. వివిధ రకాల డాక్యుమెంట్లు అందించాల్సిన పని ఉండదు.
అందువల్ల కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ఈ కొత్త బిల్లు ద్వారా చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే పాలన పరంగా కూడా పారదర్శకత వస్తుంది. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ త్వరితగతిన జరుగుతుంది. అందువల్ల సంక్షేల పథకాల అమలు కూడా ఇంకా సమర్థవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
0 Comments:
Post a Comment