AP, తెలంగాణలో భారీగా మహిళలు మిస్సింగ్.. పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ నిజాలు..!
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల వివరాలను పార్లమెంట్ వెల్లడించింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సమాధానమిచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2021 వరకు మొత్తం 7928 మంది బాలికలు మిస్ అయ్యారని తెలిపింది. 2019లో 2186 మంది, 2020లో 2374 మంది, 2021లో 3358 మంది తప్పిపోయినట్లు వెల్లడించింది. ఇక, 2019 నుంచి 2021 వరకు మొత్తం 22, 278 మంది ఏపీలో మహిళలు తప్పిపోయారని పేర్కొంది.
2019లో 6252 మంది, 2020లో 7057 మంది, 2021లో 8969 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది. ఇక, తెలంగాణలో 2019 నుంచి 2021 వరకు 8066 మంది బాలికలు, 34, 495 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు వెల్లడించారు. 2019లో 2849 మంది బాలికలు, 10, 744 మంది మహిళలు.. 2020లో 2232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు.. 2021లో 2994 మంది బాలికలు, 12, 834 మంది మహిళలు తప్పిపోయినట్లు కేంద్ర హోం శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలల్లో మహిళలు అదృశ్యమవుతోన్నట్లు పార్లమెంట్ తాజా గణాంకాలు స్పష్టం చేశాయి.
0 Comments:
Post a Comment