AP Pension Scheme: జగన్ సర్కారు శుభవార్త.. త్వరలో రెండో పెన్షన్..?
Second Pension In One Family: ఏపీలో జగన్ సర్కారు మరో కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కుటుంబంలో ఒకరికే పెన్షన్ అర్హత ఉండగా..
త్వరలో ఇద్దరికి అందజేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సాధ్యసాధ్యాతలపై సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'జగనన్న సురక్ష' పేరుతో వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కుటుంబంలో రెండో పెన్షన్ విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే కోసం వాలంటీర్లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను ఇవ్వగా.. ఇందులో రెండో వ్యక్తి ఏ పెన్షన్‌కు అర్హులు అనే ప్రశ్నను కూడా జత చేశారు. ఈ మేరకు వివరాలు సేకరిస్తున్న వాలంటీర్లు.. అన్ని ప్రశ్నలకు ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
ప్రస్తుతం ఒక రేషన్ కార్డు ఒక పింఛన్ విధానం అమలవుతుండగా.. ఇందులో దివ్యాంగులకు ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది. కుటుంబంలో ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వ్యక్తితోపాటు రెండో పెన్షన్‌కు అర్హుల వివరాలను నమోదు చేస్తున్నారు వాలంటీర్లు. వృద్ధులు, ఒంటరి మహిళ, వితంతు, దివ్యాంగులు, చేనేత పెన్షన్, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, డప్పు కళాకారులు, హిజ్రాలలో ఎవరైనా కుటుంబంలో రెండో పెన్షన్‌కు అర్హులు ఉన్నారా..? అని వాలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం 10 రకాల పెన్షన్లపై వివరాలు సేకరిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయంలో ఉండడంతో ప్రభుత్వం పక్కాగా సిద్ధమవుతోంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఒకే రేషన్ కార్డు.. ఒకే పెన్షన్ విధానం పక్కాగా అమలు చేస్తుండగా.. తాజాగా సర్వేతో సడలింపులు ఉంటాయా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండో పెన్షన్‌పై ప్రభుత్వం ప్రకటన చేస్తే.. మరింత అదనపు భారం పడనుంది. ప్రస్తుత దివ్యాంగులకు రూ.3 వేల పెన్షన్ అందజేస్తుండగా.. వృద్ధులు, ఒంటరి, వితంతు పెన్షన్ల కింద రూ.2750 అందుతోంది. వచ్చే ఎన్నికలలోపు రూ.3 వేలకు చేరనుంది.
0 Comments:
Post a Comment