60 లోనూ జుట్టు నల్లగా మెరుస్తూ కనిపించాలా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే....
60 ఏళ్లు వచ్చినా కూడా జుట్టు( Hair ) నల్లగా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఇటీవల రోజుల్లో అది అసాధ్యంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే కొందరు పాతిక ముప్పై ఏళ్లకే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.
తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు ముప్పతిప్పలు పడుతున్నారు. తరచూ కలర్స్ వేసుకుంటూ జుట్టును కవర్ చేసుకుంటున్నారు. ఇటువంటి కలర్స్ తాత్కాలిక పరిష్కారాన్ని అందించినా.. జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడుచేస్తాయి.హెయిర్ గ్రోత్ ను తగ్గిస్తాయి.
అలాగే మరెన్నో సమస్యలను తెచ్చి పెడతాయి.
అందుకే తెల్ల జుట్టు రాకుండా ముందే జాగ్రత్త పడండి. అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీని కనుక పాటిస్తే తెల్ల జుట్టు అన్న మాటే అనరు. 60 లోనూ మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్( Amla Powder ) రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పౌడర్( Curry Leaves Powder ) వేసుకోవాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor oil ) తో పాటు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గంట పాటు మూత పెట్టి వదిలేయాలి. ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
దీని వల్ల తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. కురులు నల్లగా మెరుస్తాయి. 60 ఏళ్లు వచ్చినా సరే తెల్ల జుట్టు అన్న మాటే అనరు. పైగా ఈ రెమెడీ మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెంచుతుంది. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి. ఆరోగ్యమైన ఒత్తైన నల్లని కురులను మీ సొంతం చేసుకోండి.
0 Comments:
Post a Comment